శ్రీదేవి అంటే బాలీవుడ్ శ్రీదేవి కాదు.. టాలీవుడ్ శ్రీదేవి (ప్రభాస్ 'ఈశ్వర్' ఫేం) అసలే కాదు, ఈ శ్రీదేవి వేరు. రామ్గోపాల్ వర్మ శ్రీదేవి చిత్రంలో హీరోయిన్గా ఎంపికైన అనుకృతి చుట్టూ వివాదం చెలరేగుతోందిప్పుడు. ఆ సినిమా అటకెక్కిందిగానీ, ఆ సినిమా పుణ్యమా అని అనుకృతికి కాస్తో కూస్తో గుర్తింపు దక్కింది.
అనుకృతి తాజా చిత్రం 'పాప' దర్శకుడు యోగి, తన సినిమాకి శ్రీదేవి సహకరించడంలేదంటూ పోలీసులను ఆశ్రయించాడు. అయితే అనుకృతి వెర్షన్ ఇంకోలా వుంది. 'బూతు డైలాగులు చెప్పమంటున్నారు.. నేను చెప్పలేను..' అని చెబుతోందామె. ముందుగా స్క్రిప్ట్, డైలాగులు అన్నీ విని, చదివి ఓకే చెప్పిన అనుకృతి ఇప్పుడిలా మాట మార్చడమేంటని దర్శకుడు యోగి వాపోయాడు. ఇది పాత కథ.
కొత్త విషయం ఏంటంటే, అనుకృతి తనతో దర్శకుడు యోగి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించేందుకు యత్నిస్తుండడం. ఇది నిజంగానే పెద్ద ట్విస్ట్. ఓ యువతి, తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులను ఆశ్రయిస్తే ఇంకేమన్నా వుందా.? అవతలి వ్యక్తి ఎవరైనా అడ్డంగా బుక్కయిపోయవాల్సిందే. పైగా, 'బూతు డైలాగులు చెప్పమంటుడున్నాడు..' అని అనుకృతి ఇప్పటికే ఆరోపించడంతో కేసు బలంగానే వుండే అవకాశముంది.
సినిమా అన్నాక అందులో అన్నీ వుంటాయి. హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు ఆయా సన్నివేశాల్లోని డైలాగులకు ఓకే చెప్పాకనే, సినిమాకి 'సైన్' చేయడం జరుగుతుంది. ఇప్పుడొస్తున్న సినిమాలు ఎలాంటివి.? 'బూతులు బాబోయ్..' అని ఆడియన్స్ అనుకుంటున్నా, సెన్సార్ చెవికెక్కడంలేదు. 'పాప' సినిమా టైటిల్ని ఓ కోణంలో చూస్తే 'పసితనం' తాలూకు స్వచ్ఛత కన్పిస్తుంది.. అదే సమయంలో మోహంతో ఆలోచిస్తే, దానర్థం ఇంకోలా వుంటుంది.
అసలు 'పాప'లో ఏముంంటుందోగానీ, ఈ సినిమాకి మాత్రం ఈ వివాదం కారణంగా విపరీతమైన పబ్లిసిటీ వస్తోంది. ఓ చిన్న కుర్రాడు (నిండా పదిహేనేళ్ళు కూడా లేనివాడు), ఓ అమ్మాయిని 'కామంతో' చూడటం 'శ్రీదేవి' సినిమా కాన్సెప్ట్. ఆ సినిమాకే ఒప్పుకున్న అనుకృతి, 'పాప' సినిమాలో బూతు డైలాగులంటూ సినిమా దాదాపుగా పూర్తికావచ్చిన సమయంలో, వివాదం సృష్టించడమేంటట.?