కత్తిలాంటోడు..చిరంజీవి 150 వ సినిమా. ఈ సినిమా విశేషాల కన్నా దానిపై వినిపించే గ్యాసిప్ లే ఎక్కవ. ఈ సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి కాస్త ఓవర్ కేర్ నే తీసుకుంటున్నారని తెలుస్తున్నదే. డైరక్షన్ ఎలా వుంటోందో, సీన్లు ఎలా వస్తున్నాయో రోజువారీ చెక్ చేసుకోవడం, హీరోయిన్ కోసం ఇప్పటికీ ఇంకా కిందా మీదా పడడం, ఇంకా చాలా వ్యవహారాలున్నాయి. ఈ సినిమాకు బేసిక్ రైటర్లు పరుచూరి బ్రదర్స్. అయితే చాలా మంది చేత చాలా సీన్లు రాయించారన్న వార్తలు వున్నాయి. ఆఖరికి లేటేస్ట్ గా బుర్రా సాయి మాధవ్ కూడా 16 సీన్ల వరకు రాసారని వినికిడి.
అయితే ఎంత మంది రాసినా, రచన పరచూరి బ్రదర్స్ అని మాత్రమే వేస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అంతో ఇంతో ఒకటో రెండో సీన్ల దగ్గర నుంచి ఎక్కువ సీన్లకు వర్క్ చేసిన పలువురు రైటర్లు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా పనిచేయించుకున్న వాళ్లంతా మరీ చిన్న రైటర్లు కాదు. వాళ్ల స్టామినా వాళ్లకు వుండబట్టే పిలిచి మరీ 150 సినిమాకు రాయించుకున్నారు. మరి అలాంపుడు క్రెడిట్ లైన్ ఇస్తామనే చెప్పాలి కదా?
దాంతో ఇలా కాదని, మెల మెల్లగా ఇలా సీన్లు రాసిన వారు, మీడియాకు ఫీలర్లు వదులుతున్నారు. తాము రాసిన సీన్ల లెక్కతో. అంటే రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పేరు, అసలు ఘోస్ట్ రైటర్లు ఎంతమంది అన్నది జనాలకు ముందే తెలిసిపోయేలా చేస్తున్నారన్నమాట. తెరమీద పేరు పడకుండానే జనాల్లోకి పేర్లు వెళ్లిపోతాయి. బాగానే వుంది స్ట్రాటజీ.