గ్యారేజ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అదేనా?

జనతా గ్యారేజ్..సరిగ్గా మరో నెల రోజులు వుంది జనాల ముందుకు రావడానికి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి సంగతలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  సినిమా తోలి సగం,…

జనతా గ్యారేజ్..సరిగ్గా మరో నెల రోజులు వుంది జనాల ముందుకు రావడానికి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి సంగతలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  సినిమా తోలి సగం, మలి సగం పూర్తి కాంట్రాస్ట్ తో నడుస్తాయని తెలుస్తోంది. 

తొలిసగం అంతా ఎన్టీఆర్ లవ్ ట్రాక్ తో మాంచి జోష్ తో జోవియల్ గా నడుస్తుందట. ఫన్, లవ్, కలర్ ఫుల్ సాంగ్స్ తో సాగిపోతుంటే, మధ్యలో గ్యారేజ్, మోహన్ లాల్ విషయాలు జస్ట్ పరిచయం అవుతాయట. అలాంటి గ్యారేజ్ కు, హీరో ఎలా కనెక్ట్ కావడం ఆ తరువాత జరిగే టర్నింగ్ పాయింట్ అన్నది ఇంటర్వెల్ బ్యాంగ్ గా వుంటుదట. 

అలా మలి సగంలోకి ప్రవేశించే సినిమా ఇక పూర్తి ఎమోషనల్ గా, యాక్షన్ మోడ్ లో సాగుతుందట. దర్శకుడు కొరటాల శివ ఇటు ఎన్టీఆర్ లోని డ్యాన్స్, ఫన్ స్కిల్స్ ను ప్రథమార్థంలోనూ, అటు యాక్షన్, అండ్ ఎమోషన్ టాలెంట్ ను ద్వితీయార్థంలోను వాడుకునేలా స్క్రిప్ట్ తయారుచేసుకున్నాడట. ఎన్టీఆర్ కే కాదు, కొరటాల శివ కు కూడా ఓ మంచి సినిమాగా వుంటుంది జనతా గ్యారేజ్ అని టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్.