వీరభద్రమ్ చౌదరి అల్లరి నరేష్, సునీల్ లతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు కొట్టేసాడు. ఆ వెంటనే ఎకాఎకిన నాగ్ నే డైరెక్ట్ చేయడానికి రెడీ అయిపోయాడు. కానీ ‘భాయ్’ డిజాస్టర్ కావడంతో, రెండేళ్లు వెనకబడిపోయాడు. ఇప్పుడు ఆఖరికి మళ్లీ ఆదితో ‘చుట్టాలబ్బాయి’ అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమా దాదాపు రెడీ అయిపోయింది.
కానీ ఈ సినిమా విషయంలో వీరభద్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నాడట. అది కాస్తా చాలా చాదస్తంగా మారుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బింగ్ విషయంలో నటీనటులను మరీ ఎక్కువ విసిగిస్తున్నారని టాక్. ఎన్ని టేకులు చేసినా, ఇంకా ఇంకా అంటున్నాడట.
జీవా లాంటి సీనియర్ నటులు కూడా ఎంతలా చెప్పినా డబ్బింగ్ సరిగాలేదని గంటలు గంటలు టైమ్ తీసుకుంటున్నాడట. రికార్డింగ్ టెక్నిషియన్లు పెర్ ఫెక్ట్ గా వచ్చిందని చెప్పినా, చౌదరి మాత్రం ఇంకా సమ్ థింగ్ మోర్ అంటున్నారట. ఇది జాగ్రత్త..అనుకోవాలా? లేక సినిమా కోసం తీసుకుంటున్న జాగ్రత్త చాదస్తంగా మారుతోందని అనుకోవాలా?