ఎన్టీఆర్‌ ‘గ్యారేజ్‌’కి సూపర్‌ అడ్వాంటేజ్‌

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమా టీజర్ విడుదలయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలే వున్నాయి. బ్యాక్ టు బ్యాక్…

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమా టీజర్ విడుదలయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలే వున్నాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు సెన్సేషనల్ హిట్స్ (మిర్చి, శ్రీమంతుడు) అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయన్నది నిర్వివాదాంశం. 

ఇక, ఈ ఏడాది ఇప్పటివరకూ బిగ్గెస్ట్ హిట్ అంటే 'సరైనోడు' మాత్రమే. పవన్కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్సింగ్', మహేష్బాబు 'బ్రహ్మోత్సవం' వంద కోట్ల అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. దాంతో, ఇప్పుడు కంప్లీట్ అడ్వాంటేజ్ ఎన్టీఆర్కి ఏర్పడింది. 'సెన్సేషనల్ హిట్' అనే అంచనాలున్న 'జనతా గ్యారేజ్' బాగానే ఉందన్న టాక్ దక్కించుకుంటే చాలు, కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ని అందుకోవడమే కాకుండా, ఇండస్ట్రీలో టాప్ 5 చిత్రాల్లో తన సినిమాని నిలిపేందుకు ఎన్టీఆర్కి అవకాశం దొరుకుతుంది. 

'టెంపర్', 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు ఓకే అనీ, హిట్ అనీ అన్పించుకున్నా, వసూళ్ళ పరంగా ఎన్టీఆర్ తన స్టామినాకి తగ్గ హిట్ని ఈ మధ్యకాలంలో అందుకోలేకపోయాడు. ఎప్పుడో వచ్చిన 'సింహాద్రి' తర్వాత ఆ స్థాయి హిట్ ఎన్టీఆర్కి 'జనతా గ్యారేజ్' అందిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే, ఎన్టీఆర్ మళ్ళీ నంబర్ వన్ హీరో అనే రేస్లో దూసుకెళ్తాడన్నది నిర్వివాదాంశం.