మంచు విష్ణు హెల్త్ అప్ డేట్

షూటింగ్ లో గాయపడిన మంచు విష్ణు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని, త్వరలోనే కోలుకొని అందరి ముందుకు వస్తాడని, విష్ణు తండ్రి మోహన్ బాబు ప్రకటించారు. Advertisement “మంచు విష్ణు కోలుకోవాలంటూ ప్రార్థించిన,…

షూటింగ్ లో గాయపడిన మంచు విష్ణు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని, త్వరలోనే కోలుకొని అందరి ముందుకు వస్తాడని, విష్ణు తండ్రి మోహన్ బాబు ప్రకటించారు.

“మంచు విష్ణు కోలుకోవాలంటూ ప్రార్థించిన, ప్రేమ చూపిన, ఆకాంక్షించిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. న్యూజిలాండ్ లో కన్నప్ప షూటింగ్ లో మంచు విష్ణు గాయపడ్డాడు. దేవుడి దయ వల్ల అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. త్వరలోనే షూటింగ్ సెట్స్ పైకి వస్తాడు. మీ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు.”

ఇలా తనయుడు మంచు విష్ణు కోలుకుంటున్నాడనే విషయాన్ని మోహన్ బాబు ప్రకటించారు. అయితే అతడికి ప్రమాదం ఎలా జరిగింది.. గాయాలు తీవ్రమైనవా లాంటి విషయాల్ని మాత్రం మోహన్ బాబు వెల్లడించలేదు.

తన కలల ప్రాజెక్టు కన్నప్పను న్యూజిలాండ్ లో స్టార్ట్ చేశాడు మంచు విష్ణు. తను రాసుకున్న కథకు న్యూజిలాండ్ లోని కొండలు, గుట్టలు, అడవులు సరిపోతాయని అతడు భావించాడు. అందుకే మ్యాగ్జిమమ్ షూటింగ్ ను అక్కడే చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఇందులో భాగంగా ఓ డ్రోన్ షాట్ లో పాల్గొంటున్న టైమ్ లో.. ప్రమాదవశాత్తూ డ్రోన్ అదుపుతప్పి, మంచు విష్ణు చేతిపై కుప్పకూలింది. దీంతో అతడి రెండు చేతులకు గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే అతడ్ని సమీపంలోని హాస్పిటల్ కు హుటాహుటిన తరలించారు. అతడు మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడనేది ప్రస్తుతానికి ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.