సమంతా అక్కినేని.. ఇదెలా ఉంది?

సరదాగా రూమర్ అన్నట్టుగా మొదలైన సమంత, నాగచైతన్యల లవ్ ఎఫైర్ ఇప్పుడు పెళ్లి వరకూ వచ్చేసింది. మరి జరుగుతుందో జరగదో కానీ.. మీడియాలో మాత్రం ఇదో హాట్ టాపిక్. ప్రత్యేకించి నాగార్జున కూడా ఈ…

సరదాగా రూమర్ అన్నట్టుగా మొదలైన సమంత, నాగచైతన్యల లవ్ ఎఫైర్ ఇప్పుడు పెళ్లి వరకూ వచ్చేసింది. మరి జరుగుతుందో జరగదో కానీ.. మీడియాలో మాత్రం ఇదో హాట్ టాపిక్. ప్రత్యేకించి నాగార్జున కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించి, ధ్రువీకరించనట్టుగా మాట్లాడటంతో… చైతూ, సమంతల పెళ్లి వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

వీళ్ల సంగతిలా ఉంటే.. చైతూను పెళ్లి చేసుకుంటే సమంత పేరు ఎలా మారుతుంది? అనేది ఇప్పుడు ఆమె అభిమానులకు అసక్తికరంగా మారింది. అక్కినేని వారింటికి కోడలిగా వెళితే సమంత పేరు ఎలా మార్చుకుంటుంది? అనేదానిపై వారిలో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతానికి అయితే తమిళ క్రిస్టియన్ టైప్‌లో ఉంది సమంత పేరు. క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన సమంత పూర్తి పేరు ‘సమంతా రూత్ ప్రభు’. తండ్రి పేరు ప్రభును, హిబ్రూ భాష పదం ‘రూత్’ కలిసి ఉంటుంది సమంత పేరు. మరి ఇలాంటి పేరు అక్కినేని వారింటికి కోడలు అయితే మారిపోతుంది.

నాగార్జున విషయాన్ని తీసుకుంటే.. ఆయనను వివాహం చేసుకున్నాక అమల పేరు ‘అమల అక్కినేని’గా వ్యవహరిస్తోంది మీడియా. మరి ఆమె పేరు అధికారికంగా అలా పెట్టుకుంటో లేదో కానీ.. మీడియా మాత్రం నాగార్జున భార్యను అమల అక్కినేనిగా వ్యవహారిస్తోంది.

ఐరిష్ మూలాలున్న బెంగాలీ కుటుంబం నుంచి వచ్చిన అమల పేరు అలా మారింది. ఈ లాజిక్ ప్రకారం ఇప్పుడు చైతూను వివాహం చేసుకుంటే సమంత పేరు కూడా ‘‘సమంతా అక్కినేని’గా మారుతుందనేది సమంత ఫ్యాన్స్ అనుకుంటున్న మాట. వినడానికి అయితే పేరులో రిథమ్ బాగానే ఉంది!