బన్నీ-హరీష్ శంకర్ సినిమా ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో పట్టాలపైకి ఎక్కనుంది. సరైన ముహుర్తం, మంచి టైమ్ లేకపోవడం, అంత గాభరా పడినా సంక్రాంతికి మెగా సినిమా వుండడం వంటి కారణాలతో ఏకంగా వచ్చే ఏడాది సమ్మర్ ను విడుదలకు ఫిక్స్ చేసుకున్నారు. అందుకే స్మూత్ గా స్క్రిప్ట్ డిస్కషన్లు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరై వుంటారు అన్నది అసలు పాయింట్.
మరోసారి శృతిహాసన్ తో చేస్తే ఎలా వుంటుది అని బన్నీ ఆలోచిస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. శృతి హాసన్ తో రేసుగుర్రం మంచి హిట్ అయింది..పైగా మాంచి మాస్ పెయిర్ గా పేరు వచ్చింది. అదీ కాక దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికి రెండు సార్లు శృతి హాసన్ తో పనిచేసారు. అందుకే ముచ్చటగా మూడోసారి కూడా శృతి హాసన్ తో పని చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
శృతి హాసన్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-డాలీ సినిమాలోకి తీసుకుంటున్నట్లు వార్తలు వినవచ్చాయి. కానీ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం శృతి ప్రేమమ్ సినిమా ఫినిషింగ్ వర్క్ లో వుంది. మరో వారం పది రోజుల్లో ఫ్రీ అయిపోతుంది. ఈ లోగా ఆమె డేట్ల అవైలబులిటీ గురించి బన్నీ-హరీష్ సినిమా టీమ్ వాకబు చేస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.
ఇదిలా వుంటే ఇటీవల లైమ్ లైట్ లోకి వచ్చిన నివేథా థామస్ గురించి కూడా ఆలోచన వచ్చిందని, కానీ కథ ప్రకారం సెకెండ్ హీరోయిన్ వుంటేనే నివేథా థామస్ పేరు పరిశీలన లోకి వస్తుందని వినికిడి.