ఆ సినిమాను నిర్మాతలే లీక్ చేసారా?

సినిమా విడుదలైన వెంటనే అది కాస్తా నెట్ లోకి వచ్చేస్తే, నిర్మాతలు గగ్గోలు పెడతారు. అలాంటిది అలా లీక్ కావడం వెనుక నిర్మాతల హస్తమే వుంటే..? ఈవారం విడుదలైన ఓ సినిమా వ్యవహారం ఇలాగే…

సినిమా విడుదలైన వెంటనే అది కాస్తా నెట్ లోకి వచ్చేస్తే, నిర్మాతలు గగ్గోలు పెడతారు. అలాంటిది అలా లీక్ కావడం వెనుక నిర్మాతల హస్తమే వుంటే..? ఈవారం విడుదలైన ఓ సినిమా వ్యవహారం ఇలాగే వుంది. ముళ్లపూడి వర దర్శకత్వం వహించిన కుందనపు బొమ్మ సినిమా ఈ శుక్రవారం విడుదలయింది. అయితే అది కాస్తా శనివారమే నెట్ లోని టోరెంట్స్ లో దొరికేసింది. పైగా ఫుల్ హెచ్ డి ఒరిజినల్ ప్రింట్. 

ఇదేంటీ గమ్మత్తు..సినిమా ఓవర్ సీస్ లో కూడా విడుదలయింది.. ఇలా అయితే.. ఇంకేం ఆడుతుంది అనుకున్నారంతా. నిజానికి ఆడేంత సీన్ ఆ సినిమాకు లేదనుకోండి.. అది వేరే విషయం. ఇలా లీక్ అయిపోయినా, కూడా అయ్యో.. అన్యాయం జరిగిపోయింది అని నిర్మాతలు గగ్గోలేం పెట్టలేదు. దీనికి కారణం, ఇలా లీక్ కావడం కారణం, నిర్మాతల వర్గీయులే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఆ సినిమాలో నటించిన హీరో బంధువులు, నిర్మాతల బంధువులు యుఎస్ లో ఎక్కువగా వున్నారట. యుఎస్ లో ఈ సినిమా ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఆడుతోంది. కానీ మరి వాళ్లంతా చూడాలంటే ఎలా? అందుకే ఎలాగూ సినిమా బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసిందని, నెట్ లో లీక్ చేసేసారని వదంతి వినిపిస్తోంది. ఇది నిజం కాకపోయి వుంటే, ఈ పాటికి పోలీస్ కంప్లయింట్లు, ఘోరం జరిగిపోయిందని హడావుడి అంతా వుండి వుండేవి కదా?