అన్నారంటే .. లోకేష్ కు చాలా కోపం వచ్చేస్తుంది కానీ, ఆయన తీరు మాత్రం ప్రహసనాల పాలయ్యేటట్టే కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే పులివెందుల్లో వైఎస్ కొండారెడ్డి అరెస్టు గురించి లోకేష్ స్పందన కూడా ఉంది.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే ఇంతటి దారుణమైన పరిస్థితా? అంటూ లోకేషుడు ప్రశ్నించేశారు. ఒక కాంట్రాక్టర్ ను బెదిరించిన వ్యవహారంలో వైఎస్ కొండారెడ్డి అరెస్టు అనంతరం లోకేషుడి స్పందన ఇది! మరి ఈ స్పందన విన్నాకా.. ఇంతకీ లోకేష్ బాధ ఏమిటి? వైఎస్ కొండారెడ్డిని అరెస్టు చేయడమా? అనే ధర్మ సందేహం రావడంలో వింత ఏమీ లేదు!
అవును.. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమే. అక్కడ ఒక కాంట్రాక్టర్ ను వైఎస్ కొండారెడ్డి అనే జగన్ సమీప బంధువు బెదిరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫోన్ కాల్స్ రికార్డింగుల ఆధారంగా ఆయనను అరెస్టు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయనను కోర్టు రిమాండుకు తరలించింది.
ఒక కాంట్రాక్టరును బెదిరించింది స్వయానా తన బంధువు అయినా జగన్ అరెస్టు చేయించారు! ఈ విషయాన్ని తెలుగుదేశం అధికారిక పత్రికే తన కథనాల్లో పేర్కొంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జగన్ కు బంధువు అయిన కొండారెడ్డిపై చర్యల విషయంలో వారు తటపటాయించారని, సదరు కాంట్రాక్టు సంస్థ సీఎం జగన్ కు పరిస్థితిని చెప్పడంతో.. చర్యలకు ఆయన ఆదేశించినట్టుగా తెలుగుదేశం అధికారిక పత్రిక పేర్కొంది. అంటే తన బంధువు, తన పార్టీలో ఇది వరకూ కొన్ని బాధ్యతలు చూసిన వ్యక్తే అయినప్పటికీ.. ఆయనపై చర్యలు తీసుకోమని జగన్ పోలీసులకు స్పష్టం చేసినట్టే కదా!
మరి వైఎస్ కొండారెడ్డిని జగన్ వెనకేసుకు వచ్చి ఉంటే, ఇలాంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ బయటపెట్టి ఉంటే.. అది కౌంట్ అయ్యేది! తీరా అరెస్టు కూడా అయిపోయాకా.. లోకేషుడు స్పందన, పులివెందుల్లో అంత దారుణమైన పరిస్థితా.. అనడం ఆయన మార్కు కామెడీ అయిపోతోంది. దటీజ్ లోకేష్ బాబు!