వరుణ్ తేజ్ పెళ్లి.. పవన్ కల్యాణ్ ట్రెండింగ్

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే వరుణ్ తేజ్ అవ్వాలి, లేదంటే లావణ్య త్రిపాఠి అవ్వాలి. కానీ వీళ్లిద్దరూ…

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే వరుణ్ తేజ్ అవ్వాలి, లేదంటే లావణ్య త్రిపాఠి అవ్వాలి. కానీ వీళ్లిద్దరూ కాకుండా పవన్ కల్యాణ్ ట్రెండ్ అవుతున్నాడు. అంతా పవన్ ఫ్యాన్స్ పుణ్యమే.

వరుణ్ తేజ్ పెళ్లి వేడుకకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యాడు. సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత పూర్తిగా సీన్ నుంచి మాయమయ్యాడు. ఎయిర్ పోర్టులో కనిపించిన ఫొటోలు తప్ప, వివాహ వేదిక వద్ద ఒక్క స్టిల్ కూడా లేదు.

కాక్ టైల్ పార్టీతో వరుణ్ తేజ్ పెళ్లి సందడి మొదలైంది. ఆ  తర్వాత హల్దీ ఫంక్షన్ జరిగింది. ఆ వెంటనే మెహందీ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఈ 3 ఫంక్షన్లలో మెగాహీరోలంతా కనిపించారు. కానీ పవన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. చివరికి వరుణ్ తేజ్ ను ఓపెన్ టాప్ కారులో వివాహ వేదిక వద్దకు సంప్రదాయబద్దంగా తీసుకొచ్చే సమయంలో కూడా పవన్ జాడ లేదు.

ఇదే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచింది. పవన్ కనిపిస్తే చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి, ఆల్రెడీ లీక్ అయిన వరుణ్ తేజ్ పెళ్లి ఫొటోల్లో పవన్ ను ఇరికించి, మార్ఫింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇలా వరుణ్-లావణ్య పెళ్లిలో పవన్ కల్యాణ్ ట్రెండ్ అవ్వడం గమనార్హం.

గ్రాండ్ గా వరుణ్-లావణ్య పెళ్లి.. ఈ సంగతి పక్కనపెడితే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఓ ఇంటివారయ్యారు. లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేశాడు. ఆరేళ్ల తమ ప్రేమను ఇలా వైవాహిక బంధంగా మార్చుకుంది ఈ జంట. మెగా కాంపౌండ్ కు చెందిన కుటుంబాలు, బంధువులంతా ఈ పెళ్లికి హాజరయ్యారు. వరుణ్ తేజ్-లావణ్య ఎలా పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారో, అచ్చం అలానే ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా పెళ్లి జరిగింది. ఈ రోజు నుంచి లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా మారింది. ఈ ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటుచేశారు.