ప్ర‌భాస్ సినిమా అంటే.. హీరోయిన్ల‌కు ఫుల్ మీల్సే!

మ‌ర్యాద‌ల‌కు త‌మ‌కున్న మారు పేరును నిల‌బెట్టుకుంటున్నాడు హీరో ప్ర‌భాస్. ప్ర‌త్యేకించి త‌న హీరోయిన్ల‌కు ప్ర‌భాస్ ఇస్తున్న ఫుడ్ పార్టీలు 'వ్వావ్…' అనిపించుకుంటున్నాయి వారి చేత‌. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రిగా ప్ర‌భాస్ సినిమాల్లోని హీరోయిన్లు ఇదే…

మ‌ర్యాద‌ల‌కు త‌మ‌కున్న మారు పేరును నిల‌బెట్టుకుంటున్నాడు హీరో ప్ర‌భాస్. ప్ర‌త్యేకించి త‌న హీరోయిన్ల‌కు ప్ర‌భాస్ ఇస్తున్న ఫుడ్ పార్టీలు 'వ్వావ్…' అనిపించుకుంటున్నాయి వారి చేత‌. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రిగా ప్ర‌భాస్ సినిమాల్లోని హీరోయిన్లు ఇదే మాట‌ను చెబుతున్నారు. 

ఇది వ‌ర‌కే బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకోన్ ప్ర‌భాస్ ఇచ్చిన ఫుడ్ పార్టీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పింది. ప్రాజెక్ట్ కే న‌టిస్తున్న దీపిక ఈ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా ప్ర‌భాస్ త‌న‌కు ఇచ్చిన విందు గురించి ప్ర‌త్యేకంగా పొగిడింది. ప్ర‌భాస్ ఇచ్చిన విందు మ‌ర్యాద‌కు ఆమె ఉబ్బిత‌బ్బిబ‌యిపోయింది.

ఇక ఇదే సినిమా సెట్స్ మీద‌కు జాయిన్ అయిన మ‌రో బాలీవుడ్ న‌టీమ‌ణి దిశా పాట్నీ కూడా ఇదే మాటే చెబుతూ ఉంది. ప్ర‌భాస్ తో చేసిన లంచ్ ను ఆమె చాలా ప్ర‌త్యేకంగా చెప్పింది. సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే తార అయిన దిశ ప్ర‌భాస్ ఇచ్చిన విందులో త‌న ఆనందం గురించి ట్వీట్ చేసింది.

మొత్తానికి ప్ర‌భాస్ సినిమా అంటే హీరోయిన్ల‌కు ఫుల్ మీల్సే లాగుంది. తిండి విష‌యంలో కృష్ణంరాజు కూడా రాజీ ప‌డే వాడు కాద‌నే పేరుంది. స్వ‌యంగా ఆయ‌నే ఒక ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని చెప్పారు. 

రెండు జ‌న్మ‌ల‌కు స‌రిప‌డినంత తిన్నానంటూ! ప్ర‌భాస్ కూడా ఇలా ఫుడ్ పార్టీ ల విష‌యంలో వ‌ర‌స‌గా వార్త‌ల్లో నిలుస్తుండ‌టం విశేషం.