డైరక్టర్ తన చిత్తానికి ఖర్చు పెట్టుకుంటూ పొతే నిర్మాతకే కష్టం. ఆ ఖర్చు రికవర్ చేసుకోవడానికి భారీగా రేట్లు చెప్పాల్సి వుంటుంది. అప్పుడు అమ్మకం కావడం కష్టం అవుతుంది.
విడుదల ముందు వరకు అలా వుంచుకుంటే చివరికి తెగని బేరానికి అమ్మాల్సి వస్తుంది. నాని హీరోగా తయారవుతోంది హాయ్ నాన్న సినిమా. సివిఎమ్ నిర్మాత. ఈ సినిమాకు బడ్జెట్ కాస్త గట్టిగానే అవుతోందనే వార్తలు వున్నాయి. నాని రెమ్యూనిరేషన్ ఈ మధ్య బాగా పెరిగింది. ఇరవై కోట్లకు చేరిపోయింది. అదంటే తప్పదు. దాంతో పాటు నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోంది.
దసరా సినిమా విషయంలో అదే జరిగింది. అయితే సినిమా కొంత వరకు, కొన్ని చోట్ల బాగానే ఆడింది కనుక సమస్య లేకపోయింది. కానీ హాయ్ నాన్న లాంటి ఫ్యామిలీ ఎమోషన్ మూవీకి కూడా అదే విధంగా ఖర్చు జరుగుతోంది టాలీవుడ్ లో వినిపిస్తోంది. కొత్త దర్శకులే కానీ నాని సినిమాకు పని చేస్తే మాత్రం నిర్మాత మాట వినడం కష్టం. అంతా నాని కంట్రోల్ లోనే వుంటుంది. అందుకే నిర్మాతలు అటు దసరాకు కానీ ఇటు హాయ్ నాన్నకు కానీ మాట్లాడే అవకాశం తక్కువ.
నిర్మాతకు మిగిలిన ఆప్షన్ ఒక్కటే ఖర్చు మేరకు అమ్మకాలు పెంచుకోవడం. అందుకే ఓవర్ సీస్ రైట్స్ 7.50 కోట్ల మేరకు, హిందీ డబ్బింగ్ రైట్స్ 20 కోట్లకు పైగా చెబుతున్నారని తెలుస్తోంది. ఇవి కాక ఇంకా తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ చెప్పలేదు కనుక అవి తెలియదు. ఓవర్ సీస్ కు అయిదు కోట్ల వరకు బేరాలు వస్తున్నాయి కానీ క్లోజ్ చేయకపోవడానికి కారణం ఇదే. అలాగే డిజిటల్ అమ్మేసారు కానీ హిందీ డబ్బింగ్ హక్కులు అమ్మకపోవడానికి కారణం ఇదే.
కొత్త దర్శకులు కొంచెం నిర్మాతల సమస్యలను కూడా దృష్టిలో వుంచుకుంటే బడ్జెట్ ఏమాత్రం కాస్త కంట్రోలు చేసినా ఈ సమస్య రాదు. నిర్మాత కాస్త రీజనబుల్ గా అమ్మకాలు సాగించి, ఓవర్ ఫ్లోస్ అందుకోవచ్చు.