వినండి.. వినండి.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపడతారట. వరదలు, కరువు, ప్రమాదాలు, ఇలా ఎక్కడ ఏం జరిగినా వెళ్లి ఓదార్చడం జగన్ కు అలవాటు గందా? అందుకే ఈసారి మళ్లీ ఓదార్పుకు బయల్దేరతాడంట.. ’మీకేం ఫర్వాలేదు.. నేనున్నాను.. దేవుడున్నాడు.. అధికారంలోకి వస్తాం.. కచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటా’ అంటూ ఓదారుస్తాడట.
నిజమని నమ్ముతున్నారా ఏందీ? కాదు..పవన్ అంటే కిట్టని వాళ్లో, వెటకారం పాలు ఎక్కువైన వాళ్లో ఇద్దరు ముగ్గురు కలిసినపుడు వేసుకుంటున్న చతుర్లు ఇవి. అంటే ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా నిలబడలేదు కదా..బయ్యర్లు కుదేలయ్యారు కదా..మరి అదీ విపత్కర పరిస్థితే కదా..వాళ్లకీ ఓదార్పు కావాలి కదా? అసలే ఇటీవల ఓదార్చడానికి ఏ అకేషన్ లేకుండా , జగన్ కు చేతులు కాస్త ఇబ్బంగా వున్నాయట. సో, ఈ కష్టాల బయ్యర్లను ఓదారిస్తే పోలా అని సెటైర్లు విసురుతున్నారు.
ఇంతకీ ఈ సెటైర్ విసరడం పవన్ పైనా? జగన్ పైనా? లేక ఇద్దరిపైననా?