సర్దార్ బ్రేక్ ఈవెన్ అవుతుందా?

ఈ ఫ్రశ్న కాస్త ఫన్నీగా వుండొచ్చు.  అడియోలు, థియేటర్లు, ఓవర్ సీన్…ఇలా అన్నీ కలిపి 95 కోట్ల బిజినెస్ చేసిన సినిమా బ్రేక్ ఈవెన్ కాకుండా వుంటుందా? అలా దాటకపోతే, ఈ మిగిలిన కోట్లు…

ఈ ఫ్రశ్న కాస్త ఫన్నీగా వుండొచ్చు.  అడియోలు, థియేటర్లు, ఓవర్ సీన్…ఇలా అన్నీ కలిపి 95 కోట్ల బిజినెస్ చేసిన సినిమా బ్రేక్ ఈవెన్ కాకుండా వుంటుందా? అలా దాటకపోతే, ఈ మిగిలిన కోట్లు అన్నీ కలిపి ఎవరి జేబుకు చిల్లు పెడతాయి? అన్న అనుమానం కలుగుతుంది. నిజమే అన్నీ కలిపి సర్దార్ గబ్బర్ సింగ్ 95 కోట్ల మేరకు బిజినెస్ చేసిన మాట వాస్తవం. నైజాం 20కోట్లు, సీడెడ్ పది కోట్లకు పైగా అమ్మారు. ఇక ఆంధ్ర, ఓవర్ సీస్ ఫిగర్లు సరేసరి.

అయితే తోలి రోజు కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్లకు కాస్త అటు ఇటుగా వచ్చాయి. ఇక ఓవర్ సీస్, రెస్టాఫ్ ది ఇండియా వుండనే వున్నాయి. ఇవన్నీ కలిపి 28 కోట్లకు పైగా తొలి రోజు వసూలు చేసాయి. ఓ సినిమా తొలి రోజు 28 కోట్లకు పైగా వసూలు చేయడం అంటే మాటలు కాదు. దాన్ని బట్టి పవర్ స్టార్ స్టామినాను, సినిమాపై వచ్చిన హైప్ ను అర్థం చేసుకోవచ్చు. కానీ మలి రోజుకు కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. పైగా ఆటలు కూడా రెగ్యులర్ గా నాలుగు ఆటలకు వచ్చేసాయి. కలెక్షన్లు తగ్గడానికి అది కూడా ఓ కారణం.

అయితే రెండో రోజు మూడో రోజు కలిపి మరో ఇరవై వచ్చేస్తుంది అనుకున్నా కూడా యాభై కు చేరదు. ఇక మండే నుంచి ఎప్పుడయితే ఫుల్స్ వుండవో, అక్కడి నుంచి షేర్ పడిపోతుంది. అందువల్ల ఫస్ట్ వీక్ లో మరో పది ఏడ్ చేయగలుగుతుందా అన్నది అనుమానం. 14న రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. మరోపక్క ఫ్యామిలీలకు ఇప్పుడు ఊపిరి సినిమా ఓ డెస్టినేషన్ గా వుంది.

సర్దార్ దగ్గర సమస్య ఏమిటంటే. ఫ్యామిలీలకు ఇందులో అట్రాక్షన్ ఏమీ లేదు. అలాగే అభిమానులు పోనీ రిపీట్ గా చూడాలనుకున్నా, సెకండాఫ్ లో వారికి ఏమీ జోష్ అందించలేదు. ‘ మేం తెచ్చుకున్న కాగితాలు..పూలు..జల్లడానికి సెకండాఫ్ అంతా వెయిట్ చేయాల్సి వచ్చింది..ఆఖరికి వీణ స్టెప్ వచ్చాక కానీ మాకు ఆ సరదా తీరలేదు’ అని పాలకొల్లుకు చెందిన ఓ ఫాన్ అన్నాడు.

లాస్ట్ లైన్ లోనే సమస్య

నిర్మాత దగ్గర నుంచి ఏరియాలు..ఏరియాల దగ్గర నుంచి జిల్లాలు, జిల్లాల దగ్గర నుంచి టౌన్ లు, టౌన్ ల దగ్గర నుంచి థియేటర్ల వారీగా అడ్వాన్స్ లు లేదా అమ్మకాలు జరిగిపోయాయి. చాలా మంది అత్యుత్సాహంతో థియేటర్ల వారీ కొనుక్కున్నారు. ఇవి లక్షల్లో వుండే మొత్తాలే కానీ, సినిమా ఓ రేంజ్ లో ఆడితే తప్ప రికవరీ కావడం కష్టం. టోటల్ గా థియేటరికల్ రైట్స్ 80 కోట్ల వరకు అమ్మారని వినికిడి. 

ఖర్చులతో కలిపి, బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం మరో పదిశాతం కలపాలి. అంటే టోటల్ గా 88 కోట్లు వసూలు చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ కావడం కష్టం అన్నదే ట్రేడ్ జనాల అంచనా. దీనివల్ల దెబ్బతినేది ఈ థియేటర్ల వారీ కొనుక్కున్న చిన్న చిన్న జనాలే.