ఒక్క సినిమా సరైన హిట్ పడితే చాలు హీరోయిన్ల రేట్లు కోట్లు దాటేస్తాయి. కానీ అదే సరైన సినిమాలు పడకపోతే కనుక, ఎంత ఇచ్చినా మహాభాగ్యం అని చేసేయడమే. ఆదాశర్మ.. హార్ట్ ఎటాక్ సినిమాతో పూరి పరిచయం చేసిన హీరోయిన్. ఆ తరువాత సరైన సినిమాలు పడలేదు. పడినా పెద్దగా పేరు రాలేదు.
అడప దడప ఎయిర్ పోర్ట్ ల్లో భంగిమ వన్..భంగిమ టు అంటూ ఫొటోలు తీయించుకుని మీడియాకు వదిలినా పెద్దగా చాన్స్ లు రావడం లేదు. దాంతో ఆమె రెమ్యూనిరేషన్ దారుణంగా పడిపోయిందని వినికిడి. కోటి రూపాయిల బడ్జెట్ తో తయారైన క్షణం సినిమా కోసం ఆమెకు జస్ట్ మూడు లక్షలు మాత్రం ఇచ్చారట.
అంతకు ముందు ఛాన్స్ ఇచ్చిన గరం సినిమాకు మాత్రం పది హేను లక్షలు ఇచ్చారట. అంతలో ఎంత తేడా? ఈ సంగతి తెలిస్తే ఇక మన నిర్మాతలు కేవలం ఖర్చులు ఇచ్చి సినిమా చేయమని అడిగేస్తారేమో?