వేదలమ్ సినిమా తెలుగులో తీస్తా అంటూ హీరోల చుట్టూ తిరుగుతున్నారు నిర్మాత ఏఎమ్ రత్నం. ఆయన తెలుగులో సరైన సినిమా చేసి చాన్నాళ్లయింది. పవన్ తో వేదలమ్ ను రీమేక్ చేయాలని ఆయన ఆలోచన. పవన్ కూడా కాస్త పాజిటివ్ గానే వున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఒకటి వున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వేదలమ్ హక్కులు తన దగ్గర లేకుండానే ఎ ఎమ్ రత్నం ఆ సినిమాను రీమేక్ చేద్దామని హీరోలకు ప్రతిపాదిస్తున్నారని వినికిడి.
నిజానికి ఆ సినిమాను తమిళంలో నిర్మించింది రత్నమే. కానీ హక్కులు మాత్రం ఆ సినిమా దర్శకుడు శివ దగ్గర వున్నట్లు తెలుస్తోంది. శివను పక్కన పెట్టి రత్నం హక్కులు ప్రస్తావన లేకుండా రీమేక్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవేవీ పట్టని శివ మళ్లీ అజిత్ తో మరో హిట్ కొట్టాలని బిజీగా స్క్రిప్ట్ తయారీలో వున్నారు.
తెలుగు హీరోలు అడిగితే వేదలమ్ ను తెలుగులో డైరక్ట్ చేయాలనే ఆలోచనలో శివ వున్నట్లు బోగట్టా. మరి ఎ ఎమ్ రత్నం హక్కుల కోసమైనా శివతో చేతులు కలిపి తెలుగు ప్రాజెక్ట్ చేస్తారా?