రామ్ చరణ్ కోసం బాలీవుడ్ పీఆర్వో?

రామ్ చరణ్ కెరీర్ ప్లానింగ్ అంతా ఇప్పుడు శ్రీమతి చేతుల మీదుగా సాగుతోంది. ఉపాసన మేడమ్ అన్న మాట ఎక్కువగా ఇప్పుడు రామ్ చరణ్ సిబ్బంది నోట వినిపిస్తోంది. రామ్ చరణ్ విశేషాలు, సినిమాలు,…

రామ్ చరణ్ కెరీర్ ప్లానింగ్ అంతా ఇప్పుడు శ్రీమతి చేతుల మీదుగా సాగుతోంది. ఉపాసన మేడమ్ అన్న మాట ఎక్కువగా ఇప్పుడు రామ్ చరణ్ సిబ్బంది నోట వినిపిస్తోంది. రామ్ చరణ్ విశేషాలు, సినిమాలు, వార్తల కవరేజి కోసం ఓ బాలీవుడ్ పీఆర్వోను ఉపాసన ఎంపిక చేసినట్లు వినికిడి. ఈ పీఆర్వో అచ్చంగా జాతీయ మీడియా ప్లస్ లోకల్ ఇంగ్లీష్ మీడియా కోసం వర్క్ చేస్తారు. తెలుగుకు వేరే పీఆర్వో ఎలాగూ వున్నారు.

రామ్ చరణ్ సినిమా వార్తలు, ఇంటర్వూలు, కవర్ కథనాలు వంటివి అన్నీ ఇంగ్లీష్ మీడియాలో అది కూడా పర్టిక్యులర్ గా జాతీయ మీడియాలో ఫోకస్ కావాలన్నది ఉపాసన ఆలోచనగా కనిపిస్తోంది. జాతీయ మీడియాలో ఫోకస్ అయితే వచ్చే మైలేజీ వేరు. ఇప్పటికే ఓ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ట్రయ్ చేసాడు. భారీగానే ప్రయత్నించారు కానీ, సినిమా డిజాస్టర్ కావడం తో ఫలితం దక్కలేదు. అందుకే లాంగ్ టెర్మ్ విజన్ తో ఉపాసన ఈ పబ్లిసిటీ ఏర్పాట్లు చేసినట్లు వినికిడి.

ఆల్రెడీ మహేష్, ప్రభాస్, రాజమౌళి లాంటి ప్రముఖులు జాతీయ మీడియాలో ప్రచారం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు.. ఇప్పుడు చరణ్ వంతు.