తమిళనాట సూపర్ స్టార్..విజయ్..అక్కడ అతనికి వున్న ఫాన్ ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. మరోపక్క విజయ్ కు తెలుగునాట కూడా మంచి మార్కెట్ తెచ్చుకోవాలని వుంది.. ఇది ఒకటి..
దిల్ రాజుకు చిన్న సినిమాల మీద కాస్త విరక్తి కలిగింది..పెద్ద సినిమా చేయాలని కిందామీదా అవుతున్నాడు. ఎవరి డేట్లు అందుబాటులో లేవు. దగ్గరలో ఎన్టీఆర్ డేట్లు ఒకటే వున్నాయి. ఇది ఒకటి.
ఈ ఒకటి ..ఆ ఒకటి కలిసి రెండయినట్లు..ఈ రెండు పాయింట్లు కలిసి, ఓ సినిమాగా మారబోతున్నట్లు వినికిడి. దిల్ రాజు విజయ్ తో ఓ ద్విభాషా చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అందుకు పైలెట్ ప్రాజెక్టుగా విజయ్ తెరి సినిమా తెలుగు హక్కులు కొన్నాడు.
ఆ విధంగా విజయ్ కు మంచి ఫేవర్ చేసినట్లే. ఎందుకంటే పులి డిజాస్టర్ తరువాత విజయ్ తెలుగు మార్కెట్ మరీ ఘోరంగా పడిపోయింది. మహా అయితే రెండు, మూడు కోట్లు ఇస్తే గొప్ప. ఇప్పుడు దిల్ రాజు తీసుకున్నాడు కాబట్టి, కచ్చితంగా ఆ సినిమాను బాగా మార్కెట్ చేస్తాడు..అంతకన్నా బాగా ప్రమోట్ చేస్తాడు. అంతకన్నా ఏం కావాలి విజయ్ కు.
ఇప్పుడు ఈ సినిమాతో దిల్ రాజుతో అనుబంధం ఏర్పడితే, ద్విభాషా చిత్రానికి లైన్ క్లియర్ అవుతుంది.