మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ పెళ్లి ముహుర్తం దగ్గర పడుతోంది. బెంగుళూరులో పెళ్లి, హైదరాబాద్ లో రిసెప్షన్. ఈసారి ఈ పెళ్లి స్పెషాలిటీ ఏమిటంటే, మెగాభిమానుల పాత్ర ఏమీ లేకపోవడం. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటి ఫంక్షన్ కావచ్చు.. సినిమా ఫంక్షన్ కావచ్చు.. ఫ్యాన్స్ సాయం, పార్టిసిపేషన్ అన్నది కచ్చితంగా వుండడం అన్నది ఆనవాయతీ.
ఫ్యాన్స్ లో కీలకమైన వారు, చిరుకు దగ్గరైన వారిని పిలిచి పనులు అప్పచెప్పడం అన్నది గతంలో జరిగింది. అయితే ఈ సారి ఈ పెళ్లికి సంబంధించినంత వరకు అభిమానులకు ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదని తెలుస్తోంది. మరి దగ్గర చేసి, కాస్త కీలకమైన అభిమానులకు సమాచారం వుంటుందా అని అనుకుంటున్నారు.
నిజానికి ఇప్పటికే కొంతమంది అభిమానులకైనా పిలుపు వచ్చి వుండాలని, కానీ అలా జరగలేదని కొందరు ఫ్యాన్స్ తెలిపారు. బెంగుళూరులో పెళ్లి కదా..ఇక్కడి నుంచి అభిమానులను ఎందుకు రప్పించడం అనుకున్నారేమో మెగాస్టార్?