సర్దార్ గబ్బర్ సింగ్ ట్రయిలర్ బయటకు వచ్చింది. ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే మిగిలిన సినిమా అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు..ఇది వాస్తవం. దాంతో మరో ట్రయిలర్ కట్ చేయమని పవన్ తన ఫ్రెండ్, ప్రొడ్యూసర్ శరత్ మురార్ కు చెప్పాడట. దాంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. తొలి ట్రయిలర్ విషయంలో రాజమౌళి పాట్రన్ ను ఫాలో అయ్యారని, అసలు ఆ మాటకు వస్తే, సినిమా మేకింగ్ లో కూడా రాజమౌళి స్టయిల్ పీక్ ఎమోషన్స్ కోసం ట్రయ్ చేసారని వినికిడి.
అసలు సినిమా టార్గెట్ నే వీలయినన్ని చోట్ల బాహుబలిని దాటిపోవాలని. నిజానికి తొలి ట్రయిలర్ ను పవన్ దగ్గర వుండి కట్ చేయించాడని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన పన్నెండు గంటల టైమ్ ఖర్చు చేసారట. పవన్ స్వయంగా దగ్గర వుండి, పన్నెండు గంటలు ఖర్చు చేసిన ట్రయిలర్ ఇలా వుందేటబ్బా అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Click Here For Theatrical Trailer
సరే ఆ సంగతి అలా వుంచితే, ఏ పాట్రన్ ఫాలో అయినా, కథలో పెద్దగా దమ్ములేదని తేలిపోయింది. దాంతో కథను ముందుగా చెపితే కిక్ రాలేదు..ఓల్డ్ లుక్ వచ్చింది. అందుకే సినిమాలోని థ్రిల్లింగ్ అండ్ ఛిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఓ ట్రయిలర్ వదలాలని అనుకుంటున్నారట.