రవితేజ తో దానయ్య మూవీ?

బ్రూస్ లీ తరువాత నిర్మాత దానయ్య మరో సినిమా ఇంత వరకు ప్రకటించలేదు. రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సి వుంది. అది థని ఒరువన్ తరువాత మొదలవుతుంది. అంత వరకు ఖాళీగా…

బ్రూస్ లీ తరువాత నిర్మాత దానయ్య మరో సినిమా ఇంత వరకు ప్రకటించలేదు. రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సి వుంది. అది థని ఒరువన్ తరువాత మొదలవుతుంది. అంత వరకు ఖాళీగా వుండకుండా మరో సినిమా చేయాలని దానయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

రవితేజతో ఓ సినిమా చేయడానికి దానయ్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రవితేజ చేతిలో సినిమా ఏదీ లేదు. దిల్ రాజుతో కలిసి కొత్తదర్శకుడు చక్రి సారధ్యంలో ఓ సినిమా చేద్దామనుకున్నారు. కానీ టెర్మ్స్ కుదరలేదు. ఇక రంజిత్ మూవీస్ తో కలిసి అదే ప్రాజెక్టు చేద్దామనుకున్నారు. కానీ అక్కడ కూడా వర్కవుట్ కాలేదు. 

సో..రవితేజ ఎలాగూ ఖాళీగా వున్నాడు కాబట్టి, ఆ ప్రాజెక్టు చేస్తే ఎలా వుంటుందని దానయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.