సెకండాఫ్ లో ఖాళీనా?

2016 ఫస్ట్ హాఫ్ సినిమాలు ఏమిటన్నది తెలిసిపొయింది. ఇక కొన్ని విడుదలై ఎలా వుంటాయో తెలియాలంతే. నాగ్..సోగ్గాడే చిన్ని నాయనా.. ఎన్టీఆర్.. నాన్నకు ప్రేమతో, బాలయ్య.. డిక్టేటర్.., పవన్.. సర్దార్ గబ్బర్ సింగ్.., బన్నీ..…

2016 ఫస్ట్ హాఫ్ సినిమాలు ఏమిటన్నది తెలిసిపొయింది. ఇక కొన్ని విడుదలై ఎలా వుంటాయో తెలియాలంతే. నాగ్..సోగ్గాడే చిన్ని నాయనా.. ఎన్టీఆర్.. నాన్నకు ప్రేమతో, బాలయ్య.. డిక్టేటర్.., పవన్.. సర్దార్ గబ్బర్ సింగ్.., బన్నీ.. సరైనోడు.., మహేష్ బ్రహ్మోత్సవం.., త్రివిక్రమ్-నితిన్.. అ..ఆ..  ఫస్ట్ హాఫ్ చార్ట్ లో కీలకంగా నిలచాయి.

ఇదే విధమైన క్రేజీ కాంబినేషన్లు సెకండాఫ్ అంతగా వుండేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా మాత్రమే ఇప్పటికి కనిపిస్తోంది. చరణ్ సినిమా ఇప్పుడే ప్రారంభమయింది. అందువల్ల దసరా నాటికి ఫినిష్ అవుతుందా అన్నది అనుమానం. చేయాలంటే చేసేయచ్చు..

నాగ చైతన్య.. ప్రేమమ్, వెంకీ.. బాబు బంగారం.. సాయిధరమ్-సుప్రీమ్ వున్నాయి కానీ, మరీ గొప్ప క్రేజీ కాంబినేషన్లు అయితే కావు.. నాగ్, బాలయ్య,  తలా సినిమా ప్రారంభించాలి అంటే టైమ్ పట్టేలాగే వుంది. పవన్-ఎస్ జె సూర్య , మహేష్ –మురగదాస్ ప్రాజెక్టులు ఫైనల్ అయ్యాయి కానీ, పూర్తయ్యే సరికి 2016 వెళ్లిపోతుంది. బన్నీ-విక్రమ్ కుమార్ సినిమా పరిస్థితి అంతే. ప్రభాస్ బాహుబలి సంగతి చెప్పనక్కరే లేదు.. దానికి ఇంకా చాలా టైమ్ వుంది.

సో 2016 ఫస్ట్ హాప్ వున్న రంజుగా సెకండాఫ్ వుంటుందా? అనుమానమే?