ఆలు లేదు చూలూలేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా..సినిమా లేదు..డేట్లు లేవు..డైరక్టర్ పేరు లింగుస్వామి అన్నట్లు వుంది వ్యవహారం. తమిళనా ట సినిమా ఇచ్చే దాత దైవం లేక, తెలుగులో ఎవరు అవకాశం ఇస్తారా అని ఎదురు చూపులు చూస్తున్నాడు. తమిళంలో ఊపు మీద వున్నపుడు నాగ్, మహేష్ ఇలా చాలా మంది తాము రెడీ అన్నారు.. తీరా, అక్కడ ఫేట్ ఫట్ మన్నాక, ఇక్కడ ఫేస్ లు చాటేసారు.
మహేష్ బాబు ఫస్ట్ టార్గెట్ చేసాడు.. కుదరలేదు. ఇపుడు జ్ఞాన్ వేల్ రాజా ద్వారా అరవింద్ తో తనకు వున్న పరిచయంతో అల్లు అర్జున్ డేట్ ల కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ లింగుస్వామికి తెలియంది ఏమిటంటే.. అరవింద్ కు ఎక్కడైనా బావ కానీ, సినిమా దగ్గర కాదు. అస్సలు మొహమాటం అన్నది లేదు. మంచి సబ్జెక్ట్ సూపర్ గా కుదిరితే ఏవరితోనైనా చేయడానికి బన్నీ రెడీ. కానీ అలా సబ్జెక్ట్ కుదరాలి.
లింగుస్వామి వ్యవహారం రివర్స్ లో వుంది. సబ్జెక్ట్ సంగతి అలా వుంచి, ఇదిగో సినిమా, అదిగో టెక్నీషియన్లు అంటూ గ్యాసిప్ లే వినిపిస్తున్నాయి తప్ప అసలు లేదు. బన్నీ ఇప్పుడు ఎవరికి కమిట్ మెంట్ ఇవ్వలేదు. చాలా మంది డైరక్టర్లతో టచ్ లో వున్నాడు. అందరికీ మంచి సబ్జెక్ట్ వుంటే చేద్దామనే సేమ్ డైలాగు చెబుతున్నాడు. అయితే ఫస్ట్ ఆప్షన్ లో వున్నది విక్రమ్ కే కుమార్ మాత్రమే. ఆ తరువాతే ఎవరైనా? మరి పరిస్థితి ఇలా వుంటే లింగు స్వామి గ్యాపిస్ ల్లొ తప్ప ఎక్కడున్నట్లు?