ఆరు రోజులు… మూడు పాటలు

నాన్చినన్నాళ్లు నాన్చారు..సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ ను. ఇప్పుడు ఆఘ మేఘాల మీద పరుగులు పెడుతున్నారు. డైరక్టర్ బాబీని ఎప్పుడో పక్కన పెట్టేసారన్న వార్తలు టాలీవుడ్ సర్కిళ్లలో గింగిరాలు తిరుగుతున్నాయి. ఫైట్ మాస్టర్లు,…

నాన్చినన్నాళ్లు నాన్చారు..సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ ను. ఇప్పుడు ఆఘ మేఘాల మీద పరుగులు పెడుతున్నారు. డైరక్టర్ బాబీని ఎప్పుడో పక్కన పెట్టేసారన్న వార్తలు టాలీవుడ్ సర్కిళ్లలో గింగిరాలు తిరుగుతున్నాయి. ఫైట్ మాస్టర్లు, పవన్ కలిసి ఒకేసారి మూడు యూనిట్లు నడుపుతూ చకచకా కానిస్తున్నారన్న వదంతులు వున్నాయి. 

లేటెస్ట్ బజ్ ఏమిటంటే. ఈ నెల 21న సర్దార్ యూనిట్ పాటల చిత్రీకరణకు విదేశాలకు వెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లో మూడు పాటలు తీసేయాలని పవన్ తన యూనిట్ సభ్యులకు హుకుం జారీ చేసాడట. ఆ రోజుల్లో హీరో కృష్ణ కేవలం ఒక రోజులోనే పాట మొత్తం చేసిన సందర్భాలు వున్నాయని, అందువల్ల ఇప్పుడు రెండు రోజుల్లో చేయడం పెద్ద కష్టం కాదని యూనిట్ సభ్యులకు పవన్ వివరించారట. ఎలాగైనా సరే ఆరు రోజుల్లో మూడు పాటలు పూర్తి చేసుకుని వస్తారట. 

సర్దార్ విడుదల ఏప్రిల్ 8. అంటే ఏప్రిల్ అయిదు నాటికి అన్ని పనులు పూర్తి కావాలి. ఆ రోజు లోగా సెన్సారు కావాలి. 21 నుంచి పాటలకు వెళ్లాలి. అంటే.. పది హేను రోజుల సమయం. ఇందులో పాటలకు ఆరు రోజులు తీసేస్తే, ఏడు రోజుల్లో మిగిలిన పోస్టు ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలన్నమాట. కాస్త కష్టమైన టాస్కే.