ఎంత క్రేజ్ సంపాదిస్తేనేం…ఎంత ఆస్తి సమకూర్చుకుంటనేం..సరైన ఆరోగ్యం లేకపోయాక. తెలుగు సినిమా రంగంలో ఓ టాప్ హీరోలది చాలా మందిది ఇదే పరిస్థితి. తెలుగు తెరను ఏలి, ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన హీరోకి ఆర్నెల్లు ఓ ప్రత్యేక మైన ఇంజక్షన్ చేయాలట. ఆయన ఓ సినిమాలో నటిస్తున్నపుడు, ఫైటింగ్ సన్నివేశంలో చిన్న తేడా జరిగిందని వినికిడి. అప్పటి నుంచి వెన్నులో తీవ్ర సమస్య ఏర్పడిందట. అందుకు గాను ప్రతి ఆర్నెల్లుకు ఓ ప్రత్యేకమైన ఇంజక్షన్ తీసుకోవాలంట.
ఇక తెలుగునాట మాస్ హిస్టీరియా సత్తా సృష్టించగల ఫాలోయింగ్ వున్న ఓ హీరోకి భయంకరమైన బ్యాక్ పెయిన్ సమస్య. ఫ్లాట్ బెడ్ మీదే పడుక్కోవాలి. ఆ ఫెయిన్ వచ్చినపుడు భరించలేక అరిచేస్తాడు కూడ నట.
ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు ధరించే సీనియర్ హీరోలు అనిపించుకుంటున్న నటులు ఇద్దరికీ బ్యాక్ పెయిన్ సమస్యే. వీరిలో ఒకరు ఇటీవల చాలా సివియర్ పైల్స్ సమస్యతో బాధపడి, ఆపరేషన్ కూడా చేయించుకున్నారు.
దాదాపు సీనియర్ హీరోలందరికీ మోకాళ్ల సమస్యలు వున్నాయట. ఎక్కువగా డ్యాన్స్ లు, ఫైట్లు చేయడంతో ఈ సమస్య వస్తోందట. పైగా ఎంత కాలుక్యులేటెడ్ గా వున్నా, ఎక్కడో ఓ ఫైటర్ చిన్న తప్పు చేసినా, దెబ్బలు తప్పవట..దాని ఫలితం కాస్త వయస్సు వచ్చాక అనుభవించాల్సి వస్తోందట.