ప్రభాస్ కు హైదరాబాద్ లో దాదాపు 2 ఎకరాల్లో పెద్ద స్థలం ఉన్న సంగతి తెలిసిందే. ఆమధ్య అది లీగల్ సమస్యలు కూడా ఎదుర్కొంది. మేటర్ హైకోర్టు వరకు వెళ్లింది. ప్రభాస్ కు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. ఆ సైట్ లో ఫైవ్ స్టార్ హోటల్ ను తలపించేలా ఓ ఫామ్ హౌజ్ కట్టాలనేది ప్రభాస్ ఆలోచన. ఇప్పుడా ఆలోచన నుంచి ప్రభాస్ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
మొన్నటివరకు ఆ ల్యాండ్ లో ఖరీదైన ఫామ్ హౌజ్ కడతానంటూ తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ వచ్చాడు ప్రభాస్. దీనికి సంబంధించి ముంబయికి చెందిన ఓ ఆర్కిటెక్ట్ సంస్థ కూడా రంగంలోకి దిగింది. ఇక రేపోమాపో వర్క్ స్టార్ట్ చేస్తారనుకునే టైమ్ కు ప్రభాస్ అన్ని పనులు ఆపేసినట్టు తెలుస్తోంది.
ఇది మాత్రమే కాదు, ఆమధ్య ఓ తమిళ హీరో ప్రభాస్ కు చెన్నైకు చెందిన ఓ ఖరీదైన బంగ్లా వీడియో పంపించాడు. బీచ్ ఫేసింగ్ తో ఉన్న ఆ లగ్జరీ హౌజ్ ను ప్రభాస్ తీసుకుంటాడనే ప్రచారం కూడా జరిగింది. దాదాపు 50 కోట్ల రూపాయల విలువ చేసే ఆ ప్రాపర్టీ డీల్ నుంచి కూడా ప్రభాస్ తప్పుకున్నట్టు సమాచారం.
తన పెట్టుబడుల్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతుంటాడు ప్రభాస్. ఇది బహిరంగ రహస్యం. ఇందులో భాగంగా పైన చెప్పుకున్న రెండు ప్రాపర్టీస్ పై ప్రభాస్ భారీగా పెట్టుబడులు పెట్టాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రణాళికల నుంచి విరమించుకున్నాడట.
ఉన్నట్టుంది ప్రభాస్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడు? అతడి బిజినెస్ ప్లాన్స్ మారాయా? లేక రాధేశ్యామ్ రిజల్ట్ ప్రభాస్ ఆలోచనను మార్చేసిందా?