అందరికీ అదే ‘స్వాతంత్రం’ కావాలి

కరోనా/లాక్ డౌన్ వల్ల సినిమాలకు మంచి తేదీ దొరకడం కష్టంగా మారింది. పెద్ద సినిమాలన్నీ ఒకేసారి క్యూ కట్టడంతో మంచి రిలీజ్ డేట్ దొరకడం కష్టంగా మారింది. ఈనెలాఖరు వరకు పెద్ద సినిమాల హంగామా…

కరోనా/లాక్ డౌన్ వల్ల సినిమాలకు మంచి తేదీ దొరకడం కష్టంగా మారింది. పెద్ద సినిమాలన్నీ ఒకేసారి క్యూ కట్టడంతో మంచి రిలీజ్ డేట్ దొరకడం కష్టంగా మారింది. ఈనెలాఖరు వరకు పెద్ద సినిమాల హంగామా ఉంది. జూన్ నుంచి కాస్త రష్ తగ్గుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ సినిమాలు వస్తూనే ఉన్నాయి, పోటీ పెరుగుతూనే ఉంది. తాజాగా పంద్రాగస్టుపై కన్నేశాయి కొన్ని సినిమాలు.

ఈ సారి ఆగస్ట్ 15కి పోటీ అప్పుడే మొదలైంది. నితిన్ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయాలని నిర్ణయించారు. 12 శుక్రవారం పడింది. ఆ వీకెండ్ తో పాటు 15వ తేదీ పబ్లిక్ హాలిడే ఉండడంతో.. తమ సినిమాకు బాగా కలిసొస్తుందని నితిన్ ఆ తేదీని లాక్ చేశాడు.

కానీ నితిన్ కంటే ముందే సమంత, అఖిల్ తమ సినిమాలకు ఆ తేదీని సెట్ చేసి పెట్టుకున్నారు. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న యశోద సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఆల్రెడీ ప్రకటించారు. వీళ్లందరి కంటే ముందే ఏజెంట్ సినిమాను ఆ తేదీకి తీసుకొస్తున్నామని అనీల్ సుంకర ఎప్పుడో ప్రకటించారు.

దీంతో ఈసారి ఆగస్ట్ 15 హాలిడేకి 3 సినిమాల మధ్య పోటీ ఆల్రెడీ మొదలైంది. అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదు. మరో 2 సినిమాల్ని కూడా అదే తేదీకి రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిలో ఒకటి సందీప్ కిషన్ సినిమా కాగా, ఇంకోటి అల్లరి నరేష్ మూవీ.

ఇలా రోజురోజుకు పంద్రాగస్టు పోటీ పెరిగిపోతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈసారి ఆ తేదీకి పెద్ద సినిమాలేం లేవు. అన్నీ మీడియం రేంజ్ సినిమాలే నిలబడ్డాయి. కాబట్టి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ కు ఈ విడుదల పంచాయితీ తేల్చడం పెద్ద సమస్య కాదు. 

పంద్రాగస్టు వీకెండ్ కు ఏ సినిమాలు ఫిక్స్ అవుతాయనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. అఖిల్ ఏజెంట్ సినిమా రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్నట్టు టాక్.