తెలుగులో ఆ సినిమా రీమేక్ ఇక కష్టమేనేమో..!

'బెంగళూరు డేస్' విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న రోజు నుంచి దాన్ని తెలుగులో రీమేక్ చేయడం గురించి ప్రతిపాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.. దానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ సినిమా రీమేక్…

'బెంగళూరు డేస్' విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న రోజు నుంచి దాన్ని తెలుగులో రీమేక్ చేయడం గురించి ప్రతిపాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.. దానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ సినిమా రీమేక్ ప్రపోజల్ లో అనేక మంది హీరోల పేర్లు, నటీనటుల పేర్లు వినిపించాయి. అయితే… ఇంత వరకూ ఆ సినిమా పట్టాలెక్కలేదు!

మరి మలయాళంలో సూపర్ హిట్టైన ఆ బొమ్మ గురించిన ఆసక్తి కేవలం తెలుగు వారిది మాత్రమే కాదు.. తమిళంలోనూ ఆ సినిమాపై చాలా ఆసక్తే కనిపించింది. అక్కడ రీమేక్ బొమ్మ పట్టాలెక్కింది. 'బెంగళూరు నాట్కల్' పేరుతో బొమ్మరిల్లు భాస్కర్ డైరెకన్ లో ఆ సినిమా రూపొంది.. భారీ స్టార్ క్యాస్ట్ తో ఇటీవలే విడుదలైంది కూడా! ఆర్య, రాణా, సమంత, శ్రీదివ్య, బాబీ సింహా, రాయ్ లక్మి.. ఇలా పేరున్న తారలు నటించిన ఈ సినిమా తమిళంలో పాజిటివ్ రివ్యూలనే పొందింది కానీ.. హిట్ టాక్ ను, ఆ స్థాయి కలెకన్లను తెచ్చుకోలేకపోయింది!

మరి ఈ నేపథ్యంలో.. 'బెంగళూరు డేస్' తెలుగు రీమేక్ ప్రతిపాదన ఆ దశలోనే ఆగిపోయే అవకాశం ఉందని చెప్పాలి. తమిళంలో ఆడలేదు కాబట్టి.. ఆ సబ్జెక్టును మనోళ్లు కదిలించే అవకాశాలు తక్కువ. మహా అయితే.. తమిళ వెర్షన్ ను తెలుగులోకి డబ్ చేసే అవకాశాలున్నాయి. ఎలాగూ అందులో నటించిన వారికి తెలుగులో మంచి గుర్తింపే ఉంది కాబట్టి.. బెంగళూరు నాట్కల్ ను తెలుగులోకి అనువదించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి!