పవిత్రా లోకేష్.. అంత హాట్ గానా..!

తెలుగు తెరపై ఇప్పుడు అమ్మ పాత్రలకు ప్రతిరూపం.. పవిత్రా లోకేష్. దాదాపు పదేళ్ల నుంచి వివిధ సినిమాల్లో హీరోయిన్, హీరోలకు తల్లిగా కనిపిస్తున్నా… గత కొంత కాలం నుంచి మాత్రం పవిత్రా లోకేష కు…

తెలుగు తెరపై ఇప్పుడు అమ్మ పాత్రలకు ప్రతిరూపం.. పవిత్రా లోకేష్. దాదాపు పదేళ్ల నుంచి వివిధ సినిమాల్లో హీరోయిన్, హీరోలకు తల్లిగా కనిపిస్తున్నా… గత కొంత కాలం నుంచి మాత్రం పవిత్రా లోకేష కు మంచి పేరు వచ్చింది. ఆమె తల్లి పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, ఆ సినిమాలు హిట్టైన తీరును గమనించి… ఆమెను తల్లి పాత్రకు ఎంచుకునే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఆమె యమ డిమాండ్ ఉన్న కేరెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది.

మరి ఈ నటీమణి గత రెండు మూడు సంవత్సరాల్లో సంపాదించుకున్న గుర్తింపు వేరు.. అంతకు ముందు ఈమె వేరు! తెలుగు సినిమాల్లో కాదు కానీ.. కన్నడ సినిమాల్లో ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ పవిత్రా లోకేష్. అక్కడి హీరోలతో జతకట్టి ఎన్నో గ్లామరస్ పాత్రల్లో కనిపించిందామె. రెయిన్ సాంగులకు, గ్లామరస్ డ్రస్సులకు కూడా కేరాప్ గా నిలిచి హీరోయిన్ గా అప్పట్లోనే తన ఉనికిని చాటింది పవిత్ర. అదంతా గతం. అయితే ఇది ఇంటర్నెట్ యుగం కదా! 

దీంతో పవిత్రా లోకేష్ గతంలో చేసిన సినిమాలు యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చేశాయి. ఇక కేరెక్టర్ ఆర్టిస్టుగా ఆమెకు ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని.. ఆమె గతంలో చేసిన వాన పాటలను, నటించిన రొమాంటిక్ సీన్లను కట్ చేసి యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేశారు కొన్ని యూట్యూబ్ చానల్ నిర్వాహకులు. ఇవి ఆ కంటా ఈ కంటా పడుతున్నాయి. మరి ప్రస్తుత కాలంలో తెరపై తన పేరుకు తగ్గట్టుగా కనిపిస్తున్న ఆమె గతంలో అంత హాట్ గా తెరపై కనిపించిన విషయాన్ని గమనించి చాలా మంది బుగ్గలు నొక్కుకొంటున్నారు!