శెట్టి..శెట్టి..ఏం జరుగుతోంది?

సినిమాల విడుదల, అప్ డేట్‌ల విషయంలో యువి సంస్థ అంత అయోమయంగా ఎవ్వరూ వుండరు. ఏ సినిమా అయినా అదే తీరు. ఎంత ప్రామిసింగ్ సినిమా అయినా సరే, ప్రాపర్ లాంచింగ్ వుండదు.  Advertisement…

సినిమాల విడుదల, అప్ డేట్‌ల విషయంలో యువి సంస్థ అంత అయోమయంగా ఎవ్వరూ వుండరు. ఏ సినిమా అయినా అదే తీరు. ఎంత ప్రామిసింగ్ సినిమా అయినా సరే, ప్రాపర్ లాంచింగ్ వుండదు. 

ప్రస్తుతం ఈ బ్యానర్ లేటెస్ట్ సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. అనుష్క- నవీన్ పోలిశెట్టిల కాంబినేషన్. ఏనాడో జమానా కాలం నాడు ప్రారంభమైంది. ఇప్పటికీ వర్క్ నడుస్తూనే వుంది. చెన్నయ్ లో మిక్సింగ్ జరుగుతోంది అన్నది సమాచారం.

ఈ సినిమా ట్రయిలర్ ఇవ్వాళ లాంచ్ చేయాలి. కానీ వాయిదా పడిందని తెలుస్తోంది. అసలు ట్రయిలర్ కాదు, సినిమా విడుదలే వాయిదా పడిందని వినిపిస్తోంది. ఆగస్ట్ నాలుగున విడుదల చేయాల్సి వుంది. కానీ అలా జరగదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 18 కి వెళ్లిపోయిందని తెలుస్తోంది.ఈ డేట్ కు రావాల్సిన వేరే సినిమాలు వాయిదా పడ్డాయి ఇప్పటికే.

నవీన్ పోలిశెట్టి సినిమా వచ్చి చాలా అంటే చాలా కాలం అయిపోయింది. మాంచి ఓపెనింగ్ రావడానికి అవకాశం వుంది. నవీన్ తన సినిమాల ప్రచారానికి ప్రాణం పెట్టేస్తాడు. అలాంటిది అతను కూడా ఏమీ చేయడం లేదు. యువి సంస్థ ఇలా సినిమాను సరిగ్గా ప్లాన్ చేసి, ప్రచారం చేయకపోవడం ఇది కొత్త కాదు. ప్రతి సారీ ఇలాగే జరుగుతోంది.