సినిమా రంగంలో పెద్ద హీరోల ఫంక్షన్ లకు పిలవకపోయినా పని గట్టుకుని వెళ్లడం, అటెండెన్స్ వేయించుకుని రావడం కామన్. పెద్ద హీరోల గుడ్ లుక్స్ లో వుండాలనే అందరూ అనుకుంటారు. కానీ నిన్నటికి నిన్న జరిగిన బ్రో సినిమా ఫంక్షన్ కు చాలా మంది గైర్ హాజర్ అయ్యారు. ఈ విషయం మీదే టాలీవుడ్ లో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.
పవన్ తో సినిమాలు చేస్తున్న హరీష్ శంకర్, క్రిష్ ఈ ఫంక్షన్ కు రాలేదన్న సంగతి తెలిసిందే. ఎందుకు రాలేదన్న దాని మీద చాలా గుసగుసలు వున్నాయి. ఓజి దర్శకుడు సుజిత్ సినిమా వర్క్‌లో బిజీ గా వున్నారట. అందుకే రాలేదని తెలుస్తోంది. దర్శకుడు రాకపోతే రాలేదు.. నిర్మాతలు అయిన మైత్రీ మూవీస్ వాళ్లు కూడా రాలేదు. ఎందుకు రాలేదన్నది తెలియాల్సి వుంది.
అంతే కాదు, మహేష్ గుంటూరు కారం నిర్మాతలు రాలేదు. ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ కూడా రాలేదు. బ్రో సినిమా సెట్ చేసింది, స్క్రీన్ ప్లే మాటలు అందించింది త్రివిక్రమ్ నే.. కానీ రాలేదు. వస్తాననే అన్నారని, కానీ రాలేదని ఎందుకో తెలియదని బ్రో యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమాలు తొలుత మాటలు అందించి, మధ్యలో తప్పించిన బుర్రా సాయి మాధవ్ కూడా రాలేదు.
ఒక విషయం మాత్రం టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. పవన్ ఒప్పుకున్న ప్రారంభించిన పాత సినిమాలు అన్నీ అలా పడి వున్నాయి. దానికి కారణం పవన్ కళ్యాణ్‌ను వెనుక నుంచి త్రివిక్రమ్ ప్రభావితం చేయడమే అన్నది. త్రివిక్రమ్ ప్రమేయం వున్న సినిమాలు మాత్రమే పవన్ చేస్తున్నారు.. మిగిలినవి అలా పడి వుంటున్నాయని బలంగా వినిపిస్తోంది.