టాలీవుడ్ లో కొన్ని విషయాలు పైకి చెప్పుకోలేరు. సినిమా సూపర్ హిట్ ..సూపర్ హిట్ ..అనేస్తారు..ఇంత లాభం..అంతలాభం అని వార్తలు వచ్చేస్తాయి. జనం నోటా అదే మాట..మీడియాలోనూ అదే మాట. కానీ అక్కడ చూస్తే సీన్ వేరుగా వుంటుంది. కానీ పైకి ఆ మాట చెప్పలేరు..కాదనలేరు..పెదాలతో నవ్వడం తప్ప మరేం వుండదు. ఇటీవల తెలుగు సినిమా పరిస్థితి ఇలాగే తయారైంది. అమ్మినపుడు వచ్చిన డబ్బులు తప్ప, ఆడినపుడు వచ్చిన డబ్బులు నిర్మాతకు చేరడం లేదు.
కానీ మీడియా వార్తలు, ఇన్ కమ్ టాక్స్ నోటీసులు మిగుల్తున్నాయి. అంత సూపర్ డూపర్ హిట్ అనుకున్న మనం సినిమాకు మిగిలింది కోటి రూపాయిల చిల్లర. బాహుబలి సీన్ కూడా అంతే. ఇన్ని వందల కోట్లు అన్ని వందల కోట్లు..బయ్యర్లు బాగుపడ్డారు..నిర్మాతలు కాదు. పోనీలే..రెండో పార్ట్ ను కాస్త ఎక్కువ రేట్లకు అమ్మి లాభం చేసుకుందాం అంటే..ఓ కొత్త సమస్య వచ్చిందట.
పెద్ద నటులను పక్కన పెడితే, ఓ మాదిది నటులు,రోజుకు లక్ష రేంజ్ లో తీసుకునే వాళ్లు పలువురు, రెండో పార్ట్ విషయంలో డబుల్ అమౌంట్ అడుగుతున్నారట. మీకు అన్ని వందల కోట్లు లాభం వచ్చింది. మాకు లక్ష, రెండు లక్షలు కూడా ఇవ్వలేరా అంటున్నారట. ఫస్ట్ హాఫ్ కు, సెకండాఫ్ కు లింక్ వుండడంతో కొందరు నటుల కంటిన్యూయేషన్ తప్పని సరి. దీంతో వాళ్లను కిందా మీదా పెట్టి, ఒప్పించాల్సి వస్తోందట. తొలి పార్ట్ లో కొన్ని నిమషాలు పాటు కనిపించిన ఓ క్యారెక్టర్ నటుడు, లక్ష రూపాయిల డైలీ పారితోషికాన్ని రెండున్నర లక్షలు చేసాడట.అదేంటీ అంటే, అంతంత లాభాలు వచ్చాయి..కదా మాకు కాస్త పెంచితే ఏమీ? అన్నట్లు మాట్లాడడట. దీంతో ఆఖరికి లక్షన్నర చేసారట.
సినిమా హిట్ అయిన మాట వాస్తవం..బయ్యర్లు బాగుపడ్డ మాట వాస్తవం.కానీ నిర్మాతకు డబ్బులు చేరలేదన్నదీ అంతే వాస్తవం. కానీ కోట్లు వచ్చాయన్న ప్రచారం పుణ్యమా అని కొత్త కష్టాలువస్తున్నాయి బాహుబలికి.