ప్లాఫ్ సినిమా కథతో.. హిట్ సినిమాకు సీక్వెల్..!

తమిళంలోనే గాక తెలుగులో కూడా హిట్ అయిన సినిమా 'కో'. జీవా, కార్తీక హీరోహీరోయిన్లుగా కేఈ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో 'రంగం' పేరుతో విడుదలై జీవాకు ఒక చక్కటి హిట్…

తమిళంలోనే గాక తెలుగులో కూడా హిట్ అయిన సినిమా 'కో'. జీవా, కార్తీక హీరోహీరోయిన్లుగా కేఈ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో 'రంగం' పేరుతో విడుదలై జీవాకు ఒక చక్కటి హిట్ ను ఇచ్చింది. హాలీవుడ్ సినిమా 'స్టేట్ ఆఫ్ ప్లే' స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమాలో 'ఏంజిల్స్ అండ్ డెమోన్స్' ఛాయలు కూడా కనిపిస్తాయి. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.

దాదాపు మూడేళ్ల కిందట వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు తమిళంలో సీక్వెల్ రూపొందిస్తున్నారు. “కో -2'' పేరుతో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి ఇప్పుడు ధ్రువీకరణ అయిన అంశం ఏమిటంటే… ఈ సీక్వెల్ వెర్షన్ కథ ఒక తెలుగు సినిమా స్ఫూర్తితో తయారు చేశారు అని! 'ప్రతినిధి' పేరుతో నారా రోహిత్ హీరోగా వచ్చిన సినిమా కథతోనే 'కో -2' రూపొందుతోంది. అయితే కో సినిమా సూపర్ హిట్ కాగా.. ప్రతినిధి మాత్రం ప్లాఫ్. చాన్నాళ్ల వాయిదాల అనంతరం విడుదలైన ఈ తెలుగు సినిమా నారా రోహిత్ ఇతర సినిమాలతో పోల్చినా పెద్దగా ఆడని సబ్జెక్టుగానే నిలిచింది. సోషియో పొలిటికల్ సెటైరిక్ సబ్జెక్టును సరిగా డీల్ చేయలేకపోయారని విశ్లేషకులు తేల్చేరాప్పట్లో. అందులో కూడా తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ను పెంపొందించడానికి ఈ సినిమాతో ప్రయత్నించారు ప్రతినిధి సినిమాలో. 

మరి అలాంటి  వ్యవహారాలన్నింటినీ బ్యాలెన్స్ చేసే యత్నాలతో 'ప్రతినిధి' బోల్తాపడ్డాడు. మరి ఇప్పడు అదే సబ్జెక్టును తమిళంలో రూపొందిస్తున్నారు. అది కూడా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ గా. తాము ప్రతినిధి సినిమా హక్కులను కొనుక్కొన్నామని.. 60 శాతం స్క్రిప్ట్ ను మార్చామని.. తమిళ రూపకర్తలు చెబుతున్నారు. మరి హిట్ సినిమాకు.. ప్లాఫ్ సినిమా కథతో సీక్వెల్ ను ఎలా ప్యాచప్ చేస్తారో చూడాలి!