కొరటాల శివ..మిర్చి సినిమాతో మాంచి కమర్షియల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు శ్రీమంతుడుతో తన స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. దీని తరువాత ఎన్టీఆర్ తో సినిమాచేస్తాడని ఈ మధ్య వినిపిస్తోంది. అయితే కొరటాల శివను తమ క్యాంప్ లోకి తీసుకోవాలని మెగా క్యాంప్ ప్రయత్నిస్తున్నట్లు వినికిడి.
నిజానికి శ్రీమంతుడు సినిమాకు ముందే కొరటాల శివ హీరో రామ్ చరణ్ తో సినిమా చేయాల్సి వుంది. కానీ కొన్ని కారణాలు, పరిణామాల వల్ల అది క్యాన్సిల్ అయింది. అప్పుడే బన్నీతో డిస్కషన్లు జరిగాయట. అయితే అవి మెటీరియలైజ్ అయ్యే లోగానే శ్రీమంతుడు ఫిక్సయింది. ఇప్పుడు అందుకే మళ్లీ కొరటాలకు బన్నీ క్యాంప్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. బన్నీ ఇప్పుడు బోయపాటి సినిమా చేస్తున్నాడు. మహా అయితే మరో రెండు మూడు నెలల్లో ఫ్రీ అవుతాడు.. అంటే శ్రీమంతుడు తరువాత ఎక్కువ గ్యాప్ లేకుండానే కొరటాల మళ్లీ సెట్ మీదకు వెళ్లిపోవచ్చు.
ఎన్టీఆర్ సినిమా అయితే మరి కొన్నాళ్లు ఆగాలి. అదీ కాక, బన్నీ సినిమా అంటే ఓన్ బ్యానర్ లేదా సౌండ్ ప్రొడ్యూసర్లు రెడీ. ఎన్టీఆర్ కు రెడీ గా ప్రొడ్యూసర్లు అంటే మళ్లీ మైత్రీ మూవీస్ నే కావాలి. ఎందుకంటే వాళ్లే అడ్వాన్స్ ఇచ్చి వున్నారు. మరి కొరటాల ఏ ప్రాజెక్టు వైపు మొగ్గుతాడో చూడాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వన్స్, మెగా క్యాంప్ లోకి వెళ్తే, కనీసం రెండు మూడు సినిమాలు చేయకుండా బయటకు రావడం వుండదు.