ప్రభాస్ మార్కెట్ పెరిగింది

బాహుబలి ప్రభాస్ కెరీర్ కు ఏ మేరకు కలిసి వచ్చింది అన్నది అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు మార్కెట్ విస్తృతికి కూడా బాగా పనికివస్తోందట. ఇప్పటికిప్పుడు దాని వల్ల లాభం తెలియదు కానీ, భవిష్యత్…

బాహుబలి ప్రభాస్ కెరీర్ కు ఏ మేరకు కలిసి వచ్చింది అన్నది అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు మార్కెట్ విస్తృతికి కూడా బాగా పనికివస్తోందట. ఇప్పటికిప్పుడు దాని వల్ల లాభం తెలియదు కానీ, భవిష్యత్ లో బాగా తేడాకనిపిస్తుంది. హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఇప్పుడు ప్రభాస్ సుపరిచుతుడైపోయాడు. అందువల్ల భవిష్యత్ అతగాడి సినిమాల రేంజ్ పెరుగుతుంది. 

ఈలోగా మనవాళ్లూ..ఊరుకోరు. ఆయా భాషల్లోని డబ్బింగ్ వ్యాపారులు ఊరుకోరు. బాహుబలి నటించిన సినిమా అని ప్రభాస్ సినిమాలను అక్కడకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే అంత పనికి వచ్చే సినిమాలు ఏవీ లేవు. మిర్చి ఒక్కటే అలా రెడీగా కనిపిస్తోంది. అందుకే దాన్ని మలయాళంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వినికిడి. ఇలాంటి మంచి సినిమాలు వెళ్లినా ఫరవాలేదు. కానీ బాహుబలి క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని ప్రభాస్ ఎర్లీడేస్ సినిమాలు, ఫ్లాపు సినిమాలు తీసుకుపోతే, ఉన్నమార్కెట్ చెడిపోయే ప్రమాదం వుంది.