లారెన్స్ ఈ రకమైన సినిమాలతో మెప్పించగలడా?!

హారర్ జోనర్‌లో వచ్చిన సినిమాలు వరసగా హిట్ అవుతున్నాయి. ఆ విషయంలో లారెన్స్‌కు తిరుగు లేకుండా పోయింది. రికార్డు స్థాయిలో కోట్లకు కోట్లు లాభాలు వస్తున్నాయి. స్టార్‌వేల్యూ లేకపోయినా బీభత్సమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి. వరసగా…

హారర్ జోనర్‌లో వచ్చిన సినిమాలు వరసగా హిట్ అవుతున్నాయి. ఆ విషయంలో లారెన్స్‌కు తిరుగు లేకుండా పోయింది. రికార్డు స్థాయిలో కోట్లకు కోట్లు లాభాలు వస్తున్నాయి. స్టార్‌వేల్యూ లేకపోయినా బీభత్సమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి. వరసగా ‘ముని’, ‘‘కాంచన’’, ‘గంగ’ సినిమాతో హిట్స్ కొట్టాడు లారెన్స్. ఈ విధంగా దర్శకుడిగా దూసుకుపోతున్నాడు ఈ కొరియోగ్రాఫర్.

ఈ హారర్ జోనర్ మూవీస్ మధ్యలో కొన్ని ఎంటర్ టైన్‌మెంట్ మూవీస్‌ను కూడా రూపొందించాడతను. అయితే అవేవీ ఏ మాత్రమూ ఆకట్టుకోలేకపోయాయి. తొలిసారి ఇతడు దర్శకుడిగా మారి రూపొందించిన ‘స్టైల్’ ప్రశసంలు పొందింది కానీ.. డబ్బులు రాలేదు. నిర్మాతలను ఆసినిమా ఆనందపెట్టలేకపోయింది. నాగార్జునతో తీసిన ‘మాస్’ పర్వాలేదనే స్థాయిలో కలెక్షన్లను సాధించుకొంది. అది మరీ సూపర్ హిట్ సినిమా ఏమీ కాదు. ఇక అదే నాగార్జునతో తీసిన ‘డాన్’పై విమర్శలు వచ్చాయి. లారెన్స్‌పై నాగార్జున ఫ్యాన్సే మండిపడ్డారు. ఆ తర్వాత ఏవో తమిళంలో ఒకటీ అర సినిమాలు చేశాడు అవి కూడా లేదు. 

 ఇక ‘రెబల్’ ఒక డిజాస్టర్. ఈ విధంగా ఎంటర్ టైన్‌మెంట్..స్టార్లతో తీసిన సినిమాల విషయంలో లారెన్స్ ఫెయిలయ్యాడు. అయితే హారర్ మూవీస్ వరసగా హిట్ అవుతుండటం.. వాటి విషయంలో లారెన్స్ తన సత్తా చాటుతుండటంతో అతడి కెరీర్‌కు తిరుగులేకుండాపోయింది. మరి ఇలాంటి నేపథ్యంలో అతడు మళ్లీ ఒక ఎంటర్ టైన్ మూవీని రూపొందిస్తున్నాడు. హారర్ జోనర్ నుంచి బయటకు వచ్చి ‘‘మొట్ట శివ.. కెట్ట శివ’’ అనే తమిళ సినిమాను రూపొందిస్తున్నాడు. తనే హీరోగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. హారర్ కాకుండా..కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందిస్తున్న ఇది అతడికి ఎలాంటి అనుభూతిని మిగులుస్తుందో చూడాలి!