సుమారు పది కోట్ల వరకు డెఫిసిట్ లో పడింది కిక్ 2 అని ఇండస్ట్రీ గ్యాసిప్ ల సారాంశం. పటాస్ వల్ల పేరు వచ్చింది, వచ్చిన పైసలు అలా అలా పాత కొత్త బాకీలకు సరిపోయయి. పైగా కిక్ 2కు కాస్త ఖర్చు భారీగానే అయింది. దీంతో నిర్మాత కళ్యాణ్ రామ్ ఇబ్బందుల్లో పడ్డాడని వార్తలు వినవచ్చాయి.
ఈ నెల 21న విడుదల చేసుకోవాలి లేదంటే, మొదటికే మోసం వచ్చే ప్రమాదం వుంది. అందుకే కిందా మీదా పడ్డాడు. ఈ వైనం చూసి తమ్ముడు ఎన్టీఆర్ ముందుకు వచ్చి, ఆర్థికంగా ఆదుకున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. అయితే ఆర్థికంగా సాయం కన్నా మాట సాయం, హామీ రూపంలో సాయం ఎక్కువ అని వార్తలు వినవస్తున్నాయి.
మరోపక్క త్వరలో తాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా చేస్తానని, తన కార్యాలయం ద్వారా ఎన్టీఆర్ ఫీలర్ వదిలాడు. దాని వల్ల కూడా కళ్యాణ్ రామ్ ఫైనాన్షియర్లు కాస్త వేచి వుండే అవకాశం వుంది.
మొత్తానికి ఎన్టీఆర్ పుణ్యమా అని, కిక్ 2 బయటకు వస్తుందన్నమాట. సినిమాహిట్ అయితే కళ్యాణ్ రామ్ కష్టాలు గట్టెక్కేస్తాయి.