అంటే ఫ్యాన్స్ ఫీలవుతారు. కానీ ఇది వారికి సంబంధించింది కాదు. అత్తారింటికి దారేదిలో హీరో వ్యవహారం, శ్రీమంతుడులో హీరో వ్యవహారం పరిశీలిస్తే, భలే రివర్స్ లో వుంటాయి. అక్కడా ఓ మల్టీ మిలియనీర్, సామాన్య డ్రయివర్ గా పనిచేయడానికి వెళ్తాడు.
అత్తను పుట్టింటికి తీసుకురావడానికి. ఇక్కడా ఓ శ్రీమంతుడు సామాన్యుడిలా పల్లెకు వెళ్తాడు. దాన్ని బాగుచేయడానికి. కానీ అక్కడ హీరో ఇండియాకు వస్తూనే ఓ చెక్కు విసిరేసి, కారు బలవంతంగా లాక్కుంటాడు. ఆపై వెనకాల పది మంది సర్వెంట్లు, డీజిల్, పెట్రోలు క్యాన్ లు, అతని కోసం కూరగాయలు, కాఫీ షాప్ లు. హీరోయిన్ కూడా అంటుంది..నిన్ను చూస్తే డ్రయివర్ లా లేవే అని. బహుశా అంతమంది వెనుక వుండి, అంత హంగామా చేస్తే కానీ మిలీయనీర్ అన్న లుక్ రాదని డైరక్టర్ త్రివిక్రమ్ భావించాడమో?
ఇక్కడ హీరో ఓ సైకిల్ మీద బయల్దేరతాడు. ఆర్టీసీ బస్సలో వెళ్తాడు. పైగా తను కూడా రియల్ గా వళ్లు వంచి పనిచేస్తాడు, పనివాళ్లను తోడు తెచ్చుకోడు. లుంగీ కూడా కట్టి, వాళ్లతో పలుగు పారా పట్టుకుంటాడు. బిందెలు మోసినా, ఇంకేం చేసినా హడావుడి ఏమీ వుండదు.
కానీ రెండింటికీ ఓ పోలిక మాత్రం వుంది. స్వంత అత్తను తీసుకురావాలన్న తన పర్సనల్ పని మీద వెళ్లినా, తరలించి చినుకు తనకు తానే అంటూ…పరమాద్భుతం జరిగిందని నేపథ్య గీతం. స్వంత ఊరికి సాయం చేయడానికి వెళ్తే, దాదాపు అలాంటిదే మరో నేపథ్య గీతం. మన హీరోలు చిన్న పని చేసినా అంత హైప్ వుండాలి.
మరి నిజ జీవితంలో ఊళ్లకు ఎంతో సేవ చేస్తున్నవారు, జీవితాలు ధారపోస్తున్నవారు, విదేశాల్లో వుంటూ తాము చదివిన కాలేజీలకు, పెరిగిన ఊళ్లకు లక్షలు, కోట్లు ఇస్తున్నవారు వున్నారు. కానీ ఎక్కడా సందడి లేదు. ఇది జీవితం..అవి సినిమాలు అంతే..పోలిక కోసం కాదు. జస్ట్ అనుకోవడం అంతే. మన సినిమాలకు హీరోయిజం అంటే ఇంతేనా..ఈ మాత్రానికేనా అన్న చిన్న అనుమానం.