ఆ దర్శకుడి పెళ్లి ఆ హీరోయిన్ తో కాదా…!

త్వరలోనే నా పెళ్లి ఉంటుంది అని ప్రకటించిన ఒక దర్శకుడు.. పెళ్లి చేసుకోబోతున్నది ఆ హీరోయిన్ ను కాదనే విషయం స్పష్టం అవుతోంది. ఆమెను వివాహం చేసుకోవడానికి చాలా ఆసక్తిని ప్రదర్శించి.. ఆమె ప్రేమలో…

త్వరలోనే నా పెళ్లి ఉంటుంది అని ప్రకటించిన ఒక దర్శకుడు.. పెళ్లి చేసుకోబోతున్నది ఆ హీరోయిన్ ను కాదనే విషయం స్పష్టం అవుతోంది. ఆమెను వివాహం చేసుకోవడానికి చాలా ఆసక్తిని ప్రదర్శించి.. ఆమె ప్రేమలో మునిగి తేలిన అతడు ఆమెనే వివాహం చేసుకొంటాడేమో అని ఇండస్ట్రీలో చాలా మంది ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ దర్శకుడు తన పెళ్లి కబుర్లు చెబుతుండటం… ఆ హీరోయిన్ మాత్రం దానితో ఏం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుండటంతో మాత్రం పెళ్లి వాళ్లిద్దరికీ కాదని స్పష్టం అవుతోంది.

ఆ దర్శకుడు ఆ హీరోయిన్ తో రెండు సినిమాలకు కలిసి పనిచేశాడు. తొలి సినిమా సూపర్ హిట్ అయ్యే సరికి.. ఆమెకు ఆయన మీద అభిమానం పెరిగింది. తన తర్వాతి సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా అనుకున్నాడు  ఆ హీరోయిన్ కూడా అతడిపై చాలా నమ్మకాన్నే ఉంచింది. అంతే కాదు… ఇదే ఉత్సాహంలో అతడు ఆమెతో తన ప్రేమను కూడా ఎ క్స్ ప్రెస్ చేసినట్టుగా తెలుస్తోంది. అతడి నేపథ్యానికి… ఆమె నేపథ్యానికి… అతడి స్థాయికి ఆమెకున్న క్రేజుకు… చాలా తేడాలే ఉన్నా… అతడి ప్రేమను ఆమె యాక్సెప్ట్ చేసిందని కూడా వార్తలొచ్చాయి. మరీ డేటింగులూ గట్రా చేయకపోయినా… అతడి ప్రేమను ఆమె అర్థం చేసుకుందన్న వాళ్లను బాగా ఎరిగిన వాళ్లు చెప్పుకొచ్చారు. ఒక దశలో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమనే కబుర్లు కూడా వినిపించాయి. అందుకు తగ్గట్టుగా వీళ్లిద్దరూ కలిసి పనిచేయడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది.

అయితే ఇప్పుడేమో తను వివాహం చేసుకోబోతున్నట్టుగా ఆ దర్శకుడు చెబుతున్నాడు. మరి ఆ హీరోయిన్ మాత్రం ఆ విషయం గురించి అస్సలు మాట్లాడటం లేదు. చేతి నిండా అవకాశాలుండటంతో ఆమె సినిమాలతో బిజీగానే ఉంది. దీంతో ఆ దర్శకుడు పెళ్లి చేసుకోబోతున్నది ఆ హీరోయిన్ నే అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. మరి వీరి ప్రేమకథకు త్వరలోనే ఒక ఎండింగ్ రావడం మాత్రం ఖాయమని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.