బావా బావా పన్నీరూ.. బావని పట్టుక పొగిడేరు

మనవాళ్ళని మనం పొగుడుకోవడంలో తప్పు లేదు. ఇది మనకు కొత్తగానీ ఇంగ్లీషు వాడయితే ప్రతిదానికీ థ్యాంక్స్‌ అనో, అమేజింగ్‌ అనో మెచ్చుకుంటూ వుండడం సహజం. ‘లయన్‌’ ఆడియో ఫంక్షన్‌లో బాలయ్యబాబుని చంద్రబాబు పొగిడిన తీరుకు…

మనవాళ్ళని మనం పొగుడుకోవడంలో తప్పు లేదు. ఇది మనకు కొత్తగానీ ఇంగ్లీషు వాడయితే ప్రతిదానికీ థ్యాంక్స్‌ అనో, అమేజింగ్‌ అనో మెచ్చుకుంటూ వుండడం సహజం. ‘లయన్‌’ ఆడియో ఫంక్షన్‌లో బాలయ్యబాబుని చంద్రబాబు పొగిడిన తీరుకు ఆయన వీరాభిమానులే నోరెళ్ళబెట్టేశారంటే చంద్రబాబు ఏ స్థాయిలో మాట్లాడారో అర్థం చేసుకోవచ్చు. 

తెలుగులో మాస్‌ హీరో బాలయ్య ఒక్కడే. ఈయనలా ఇంకెవ్వరూ నటించలేరు. డైలాగ్‌ చెప్పాలంటే బాలయ్య. మరో నటుడికి అది సాధ్యం కాదు. ఈ సినిమా వంద రోజులు కాదు, సంవత్సరం ఆడుతుంది. సింహం టైటిల్‌గా పెడితే నాటి ఎన్టీఆర్‌ నుండి నేటి బాలయ్య వరకూ హిట్స్‌ ఇచ్చారు. 

అసలు బాలకృష్ణ లాంటి మాస్‌ హీరో లేనే లేడు. లయన్‌ ఒక్కడే బాలయ్యబాబు.. అనేలా చంద్రబాబు చెబుతుంటే జనం నోరెళ్ళబెట్టారు. బావగారు అలా చెబుతుంటే బాలయ్య కళ్ళల్లో కోటి కాంతులు.