కోరక కోరక ఓ కోరిక కోరాడట బన్నీ ఇప్పుడు దిల్ రాజును. అలా అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి,. పెద్ద హీరో కోరిన తరువాత తీర్చకుంటే ఎలా అందుకే వెంటనే దిల్ రాజు చెన్నయ్ బయల్దేరి వెళ్లారని బోగట్టా. అయితే ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే, ఓకె బంగారం సినిమాను ఒక్క వారం వాయిదా వేసుకోమని.
ఎందుకంటే సన్నాఫ్ సత్యమూర్తి కలెక్షన్లు ఇప్పుడు బాగానే వున్నాయి. సోమవారం నుంచి ఎలా వుంటాయో చూడాలి. మరో వారం కనుక సోలోగా బరిలోవుండగలిగితే, 63 కోట్ల అమ్మకాలకు కాస్త న్యాయం జరుగుతుంది. లేకుంటే కష్టమవుతుంది. అందుకే దిల్ రాజను బన్నీ ఈ కోరిక కోరాడని టాలీవుడ్ టాక్.
అయితే కేవలం ఇది దిల్ రాజు చేతిలో వుంటే వెంటనే పని జరిగిపోను. అటు తమిళ వెర్షన్ విడుదల కూడా 17నే. అందుకనే మణిరత్నంతో మాట్లాడి, వీలయినంత సానుకూలంగా పని సాధించుకు రావాలని దిల్ రాజు చెన్నయ్ వెళ్లాడని తెలుస్తోంది.