విక్రమ్ కు ఇక రిటైర్మెంట్?

దక్షిణాదిన వున్న మంచి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు విక్రమ్. మొన్నటికి మొన్న మణిరత్నం రావణ్ లో కూడా అద్భుతమైన నటన కనబర్చాడు. దాదాపు ఏడాది కాలంగా ఐ సినిమాకు అంకితమై వుండిపోయాడు. దానివల్ల…

దక్షిణాదిన వున్న మంచి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు విక్రమ్. మొన్నటికి మొన్న మణిరత్నం రావణ్ లో కూడా అద్భుతమైన నటన కనబర్చాడు. దాదాపు ఏడాది కాలంగా ఐ సినిమాకు అంకితమై వుండిపోయాడు. దానివల్ల మనిషి శారీరకంగా చాలా మారిపోయాడు. 

మొహం చాలా వరకు పాడయిపోయినట్లు కనిపించింది సినిమాలో. పైగా చిరకాలంగా హిట్ అన్నది లేకుండా వుంది. వీటన్నింటి నేపథ్యంలో విక్రమ్ మళ్లీ ఇపట్లో సినిమా చేస్తాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.  నిజానికి విక్రమ్ చేతిలో ఒక సినిమా వుంది. మురగదాస్ నిర్మాతగా సినిమాటోగ్రాఫర్ విజయ్ రూపొందించే సినిమా అది. 

ఇన్ని ఫ్లాపుల తరువాత, పైగా వయసు, శరీరంపై ప్రయోగాలు తెచ్చిపెట్టిన మార్పు కారణంగా విక్రమ్ కు సరైన సినిమా ఇప్పట్లో పడుతుందా అన్నది అనుమానం. విక్రమ్ ప్రస్తుతం యాభై దగ్గరగా వున్నారు. సరైన పాత్ర దొరికితే విక్రమ్ పులి అయిపోతారు. అలాంటిది దొరికేవరకు విక్రమ్ కు ఇక విశ్రాంతే.