మెగా ఫ్యామిలీకి కృష్ణుడి పేరు కలిసి వచ్చినట్లు లేదు. సంతృప్తికరమైన విజయాన్ని వారికి అందించలేదు. గోవిందుడు అందరి వాడేలే సినిమా రామ్ చరణ్ కు ఓకె అనిపించింది తప్ప, బ్లాక్ బస్టర్ కాలేదు. ఎవరి అంకెలు వారు చెప్పుకున్నారు తప్ప అసలు అంకెలు దానికి దూరం అని సినిమా వర్గాల బోగట్టా.
ఇక ముకుంద అంటూ వచ్చిన వరుణ్ తేజ్ కు కూడా పేరు బలం కలిసి రాలేదు. మంచి సినిమా అనిపించుకుంది కానీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. నష్టాలే మిగిల్చంది.
ఇక పవన్ గోపాల గోపాల సంగతి కూడా కాస్త అటు ఇటు గానే వుంది. ఇప్పుడు ఎంత వాదించినా, ఏడాది చివరకు వచ్చేసరికి దాన్ని ఏ జాబితాలో చేరుస్తారో, అప్పుడు చూడాలి.
గోవిందుడు కూడా ముందు ఇలాగే వాదించి, ఏడాది చివర్న ఏవరేజ్ సినిమాల జాబితాలో చేర్చారు. అయితే వాణిజ్యపరంగా మూడింటి ఫలితం పెద్ద ఆశాజనకంగా లేకున్నా, మంచి సినిమాలు చేసారు మెగా హీరోలు అని మాత్రం పేరు తెచ్చిపెట్టాయి. కృష్ణుడి పేరు ఆ విధంగా మాత్రమే వారికి కలిసి వచ్చింది.