బరిలోకి బాలయ్య

లెజెండ్‌తో ఘన విజయం సాధించిన బాలకృష్ణ ప్రస్తుతం తన 98వ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కొత్త దర్శకుడితో చేస్తోన్న ఈ చిత్రం కూడా బాలకృష్ణ స్టయిల్లో మాస్‌ని మెప్పించేలానే ఉంటుందట. ఈ చిత్రాన్ని…

లెజెండ్‌తో ఘన విజయం సాధించిన బాలకృష్ణ ప్రస్తుతం తన 98వ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కొత్త దర్శకుడితో చేస్తోన్న ఈ చిత్రం కూడా బాలకృష్ణ స్టయిల్లో మాస్‌ని మెప్పించేలానే ఉంటుందట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారని సమాచారం. 

సంక్రాంతికి పలు సంచలన విజయాలు సాధించిన రికార్డ్‌ ఉన్న బాలకృష్ణ మరోసారి సంక్రాంతినే టార్గెట్‌ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఆయనకి సంక్రాంతి అంతగా కలిసి రాకపోయినా కానీ ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌ సంక్రాంతికే వచ్చాయి. 

వచ్చే సంక్రాంతి బరిలో గోపాల గోపాల ఆల్రెడీ ఖరారు కాగా, ఎన్టీఆర్‌, పూరిల చిత్రం కూడా అప్పుడే వస్తుందని న్యూస్‌. బాలకృష్ణ కూడా బరిలోకి దిగితే సంక్రాంతి పోరు రసవత్తరంగా మారుతుంది.