అనుభవించు రాజా..అన్న సాంగ్ అప్పట్లో పెద్ద హిట్. ఎన్టీఆర్-దాసరి సినిమా కోసం సినారె రాసిన పాట అది. ఇప్పుడు అదే మకుటంతో సినిమా రాబోతోంది.
నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ మీద నిర్మించే ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరో. భీమవరం రాజులు అంటే జనాలకు వాళ్ల మర్యాదలు, విలాసాలు, బోలెడు రకాల రుచులు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు అదే లైన్ తో ఈ సినిమా చేసేసారు.
తండ్రి, తాతలు బోలెడు సంపాదించి పోతే, వాటిని అనుభవించడమే పనిగా పెట్టుకునే ఓ కుర్రాడు అనుకోకుండా ఇబ్బంధుల పాలైతే..అన్న కాన్సెప్ట్ తో తయారవుతోంది.
ఈ సినిమాకు టైటిల్ 'అనుభవించు రాజా' అన్నమాట. దాదాపు పూర్తయిపోయిందీ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. నిర్మాత నాగార్జున ఫైనల్ కాపీ చూసాక విడుదల డేట్ ఫిక్స్ చేస్తారు.