సంక్రాంతి రేస్ లో టాప్ స్టార్స్

2022 సంక్రాంతి రేస్ ఇప్పుడే అనౌన్స్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో ఢీ కొట్టబోతున్నారు.  Advertisement 2020 సంక్రాంతికి మెగా హీరో బన్నీ తో…

2022 సంక్రాంతి రేస్ ఇప్పుడే అనౌన్స్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో ఢీ కొట్టబోతున్నారు. 

2020 సంక్రాంతికి మెగా హీరో బన్నీ తో పోటీ పడిన మహేష్ 2022 సంక్రాంతికి కూడా మళ్లీ మరో మెగా హీరోను ఢీ కొన బోతున్నారు. రెండూ భారీ సినిమాలే..భారీ బడ్జెట్ సినిమాలే.

మహేష్ సర్కారువారిపాట కు పరుశురామ్ దర్శకుడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా. పవన్ 'వీరమల్లు' సినిమాకు క్రిష్ దర్శకుడు. ఇది పీరియాడిక్ యాక్షన్ సినిమా. 

సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు వుండడం, ఢీకొనడం మామూలే. 2020 లో కూడా మహేష్, బన్నీ సినిమాలు పోటాపోటీగా వసూళ్లు చేసాయి. అయితే బన్నీ సినిమా కొంత శాతం ఎక్కువగా వసూలు చేసింది.

మారుతున్న సినిమా వ్యవస్థలో 2020 లోనే సంక్రాంతి సీజన్ దాదాపు రెండు వందల కోట్ల వసూళ్లు కళ్ల చూసింది. ఈ లెక్కన 2022 లో మూడు వందల కోట్లు కళ్ల చూసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మామూలుగా వుండదు. 

పవన్ ఓ మానసిక రోగి

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ