కొండా విజయ్ కుమార్ హ్యాట్రిక్

డైరక్టర్ కొండా విజయ్ కుమార్ హ్యాట్రిక్ అంటే వరుసగా మూడు సినిమాలు హిట్ అన్నది కాదు. అది చెప్పడానికి ఇంకా టైమ్ వుంది. ఈ లోగా మరో విధమైన హ్యాట్రిక్ ఇది. హీరో రాజ్…

డైరక్టర్ కొండా విజయ్ కుమార్ హ్యాట్రిక్ అంటే వరుసగా మూడు సినిమాలు హిట్ అన్నది కాదు. అది చెప్పడానికి ఇంకా టైమ్ వుంది. ఈ లోగా మరో విధమైన హ్యాట్రిక్ ఇది. హీరో రాజ్ తరుణ్ తో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారు

ఇఫ్పటికే ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే అనే రెండు సినిమాలు చేసారు. ఒకటి విడుదల అయింది. మరోటి ఈవారంలో విడుదల కాబోతోంది. ఇది కాక మరో సినిమా చేయబోతున్నారు. 

రానా నిర్మాతగా డ్రీమ్ గర్ల్ అనే సినిమా రాజ్ తరుణ్ చేయాల్సి వుంది. ఇది హిందీ సినిమాకు రీమేక్. ఈ ప్రాజెక్టు కు కూడా కొండా విజయ్ కుమార్ పేరే పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది.

గతంలో రాజ్ తరుణ్ వరుసగా మూడు సినిమాలు ఒకే బ్యానర్ లో (ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ) లో చేసాడు. ఇప్పుడు మూడు సినిమాలు ఒకే డైరక్టర్ తో చేయబోతున్నాడు. 

పవన్ ఓ మానసిక రోగి

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ