ఆ సినిమాలో పవన్ భజన పీక్స్‌కి చేరుతుందేమో..!

ఒకరేమో పవన్‌ను దేవుడు.. అని కీర్తించే వ్యక్తి. మరొకరు పవర్ స్టారే నా ప్రాణం అని చెప్పుకొనే వ్యక్తి. ఇలాంటి ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడం అంటే.. అందులో పవర్ స్టార్ భజన మ్రోగిపోతుందేమో…

ఒకరేమో పవన్‌ను దేవుడు.. అని కీర్తించే వ్యక్తి. మరొకరు పవర్ స్టారే నా ప్రాణం అని చెప్పుకొనే వ్యక్తి. ఇలాంటి ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడం అంటే.. అందులో పవర్ స్టార్ భజన మ్రోగిపోతుందేమో అనుకోవాల్సి వస్తోంది. త్రివికమ్ శ్రీనివాస్.. పవన్‌ను దేవుడు అనేసిన వ్యక్తి. నితిన్ పవన్‌పై భక్తి ప్రవత్తులు అధికంగా కలిగిన హీరో. తన ప్రతి సినిమాలోనూ ఏదో విధంగా పవన్ ప్రస్తావన చేస్తుంటాడు నితిన్. తన సినిమా విడుదల అయినా.. పవర్ స్టార్ సినిమా విడుదల అయినా.. నితిన్ ఒకేలా పండగ చేస్తూ ఉంటాడు.

ఇప్పటికే పవన్‌ను అమితంగా ఆరాధించే హీరోగా ముద్రపడిపోయింది నితిన్‌కు. ఇలాంటి నేపథ్యంలో.. త్రివికమ్‌తో అతడు సినిమా చేయబోతున్నాడు. మరి ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి పవన్‌ను ఎంతలా వాడుకొంటారో.. ఎలా వాడుకొంటారో వేచి చూడాల్సి ఉంటుంది. అసలుకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడానికి కారణమే పవన్ కల్యాణ్ అనే వార్తలు వస్తున్నాయి. 

పూరీతో సినిమా క్యాన్సిల్ కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నితిన్‌ను, సన్నాఫ్ సత్యమూర్తి నిరాశపరచడంతో పెద్ద హీరోల ఆదరణ కోల్పోయిన దశలో ఉన్న త్రివికమ్ ను కలిపిందే పవన్ కల్యాణ్ అని తెలుస్తోంది.