శ్రీమంతుడు సెన్సార్ దగ్గరకు వచ్చిందని తెలుస్తోంది. చూసారనీ, లేదు టెక్నికల్ గా చిన్నప్రాబ్లమ్ వుందని, సోమవారం చూస్తారని మరో టాక్. కానీ సినిమా గురించి కాస్త టాక్ మాత్రం బయటకు వచ్చింది., కాస్త స్లోగా వున్నా బాగుందని రిపోర్టు వినవస్తోంది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ మాధి తన అద్భుతమైన సినిమాటోగ్రాఫీతో సినిమాను నిలబెట్టాడని అంటున్నారు.
సినిమా లైన్ గతంలో బాలయ్య నటించిన జననీ జన్మభూమిని కాస్త గుర్తుకు తెస్తుందంటున్నారు. తండ్రి (సత్యనారాయణ) కొడుకు (బాలకృష్ణ) డబ్బులో మునిగి తేలుతుంటారు. ఓ దశలో కొడుకు ప్రపంచం మీదకు వస్తాడు. అక్కడి నుంచి పల్లెలు, సమస్యలు, దొపిడి వగైరా కే విశ్వనాధ్ స్టయిల్ లో వుంటాయి. ఒక దశలో తండ్రి సత్యనారాయణే విలన్ గా అనిపిస్తాడు.
శ్రీమంతుడులో కూడా ప్రారంభంలో పెద్దగా ఏవీ పట్టించుకోని హీరో, తరువాత హీరోయిన్ పరిచయం అయ్యాక పల్లెకు చేరి, సమస్యలు పరిష్కరించడం అనే లైన్ అంటూ వినవస్తోంది. అయితే జగపతి బాబు క్యారెక్టర్ ఏ దిశగా పయనిస్తుందో తెలియాల్సి వుంది.